పాప్ సింగర్ మధు 'దేశి గర్ల్' ఆల్బమ్ విడుదల

 

 

 

 

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన పాప్ సింగర్ మధు రూపొందించిన 'దేశి గర్ల్' ఆల్బమ్ గురువారం రాత్రి హైదరాబాద్ లో తాజ్ డెక్కన్ లో విడుదలైంది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ, సంగీత ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఆల్బమ్ లోని తొలి పాటను దశరథ్, రెండో పాటను ఆర్పీ పట్నాయక్, మూడో పాటను రమేష్ పుప్పాల ఆవిష్కరించారు.

 

డైరెక్టర్ దశరథ్ మాట్లాడుతూ: ''మధుకు పాటలంటే చాలా ఫ్యాషన్. పాప్ సింగర్ గా మంచి పేరు తెచ్చుకుంది. సంగీతం మీద తనకున్న ఆసక్తి ఇంత దూరం వచ్చేలా చేసింది. వీడియో ఆల్బమ్ కూడా చలా బాగుంది'' అన్నారు.



ఆర్పీ పట్నాయక్  మాట్లాడుతూ:  ''పాప్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న మధు ఎంతో కష్టపడి ఈ స్థానానికి చేరుకుంది. ఈ రంగంలో ఆమె అనుకున్న అన్ని స్థానాలను చేరుకోవాలి'' అన్నారు. 



నిర్మాత రమేష్ పుప్పాల మాట్లాడుతూ: ''మధు ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడిందో నాకు ప్రత్యేకంగా తెలుసు. తన ఇళ్ళు కూడా తాకట్టు పెట్టి ఎన్నో కష్టాలను అధిగమించింది. అనుకున్నదాని కోసం ఇంతగా కష్ట పడేవారు అరుదుగా ఉంటారు. ఆమె తప్పకుండా విజయం సాదించాలి'' అన్నారు.  



పాప్ సింగర్ మధు మాట్లాడుతూ...''నేను పడ్డ కష్టాన్ని ఇంతమ౦ది గుర్తించారని అనుకుంటుంటే ఆనందంగా ఉంది. నిజానికి ఇంత మంది సపోర్ట్ తో కష్టాన్ని ఈజీగా అధిగమించాను. నేను చిన్నప్పటి నుంచి కవితలు రాసేదాన్ని. న్యూజేర్సిలో మా ఇంటి పక్కన సాయిబాబా గుడి ఉండేది.అందరూ నైవేద్యాలు సమర్పిస్తుంటే నేను ఓ భజన్ పాడతానని అన్నాను. ఇక రెండు రోజులు ఉదనంగా రాసి పాడాను. తొలిసారి నా పాటను నేను పాడుతుంటే నాకు వణుకు పుట్టింది. ఈ స్థాయికి రావడానికి చలా కష్టపడ్డాను. నా దేశిగర్ల్ ఆల్బమ్ అందరూ ఆదరిస్తారని నమ్మకం ఉంది''అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని మధుని అభినందించారు.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu