మోడీ ప్రధాని అయితే వినాశన౦: ప్రధాని

 

 

 

''బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ ప్రధాని అయితే దేశానికి వినాశకరం. గుజరాత్‌లో జరిగిన మారణహోమం దేశంలో జరగాలనుకోవడం లేదు” అని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మోడీ మీద తన అభిప్రాయాన్ని ఇలా వినిపించారు. తన పదేళ్ల పాలనగురించి ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన గ్రామీణ వికాసానికి యూపీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ , రోడ్ల విషయంలో గణనీయ అభివృద్ధి సాధించామని అన్నారు.

 

మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనని, రాహుల్ సమర్థవంతమైన నాయకుడని తెలిపారు. రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వంపై సరైన సమయంలో మా పార్టీ నిర్ణయం తీసుకుంటుందని, ఎన్నికల తరువాత కొత్త ప్రధానికి నా బాధ్యతలు అప్పగిస్తానని తెలిపారు. ఉపకార వేతనాలు, సర్వశిక్ష అభియాన్ లతో విద్యా వ్యవస్థ మెరుగుపడిందని మన్మోహన్ అభిప్రాయపడ్డారు. నిత్యావసరాల ధరలు నియంత్రణకు చర్యలు తీసుకున్నామని, ఆహార భద్రత బిల్లుతో ప్రజలకు మేలు చేశామని అన్నారు. గతం నుంచి మనం పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని, రక్షణ రంగంలో పెట్టుబడులు కొనసాగిస్తామని తెలిపారు.