TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నేడే పాక్ ప్రధాని ఓపెన్ హార్ట్ సర్జరీ.. మోడీ ఫోన్

Published on: Tue May 31, 2016 10:33AM

 

నేడు పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు ఓపెన్ హార్ట్ సర్జరీ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు స్వయంగా ఫోన్ చేసి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈవిషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. సర్జరీకి వెళ్లే ముందు షరీఫ్ కు మోడీ ఫోన్ చేశారని, శస్త్రచికిత్స విజయవంతమై త్వరగా కోలుకోవాలని ప్రధాని కోరారని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. ఆపరేషన్ అనంతరం, షరీఫ్ ఓ వారం రోజులు ఆసుపత్రిలోనే ఉంటారని తెలుస్తోంది.