ధోని ఆధార్ వివరాలు బహిర్గతం...ఎన్ రోల్ మెంట్ కేంద్రంపై నిషేదం...

 

ఇండియన్ మాజీ కూల్ కెప్టెన్ ధోని ఆధార్ వివరాలు బహిర్గతం అయిన సంగతి తెలిసిందే. ధోని ఆధార్‌కార్డు వివరాలు, ఫొటోలు ట్విట్టర్లలో హల్ చల్ చేశాయి. ఇందుకుగాను ధోని సతీమణి సాక్షి ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఫిర్యాదు చేసింది. అంతేకాదు దీనిపై పార్లమెంటులో మాజీ, ప్రస్తుత ఆర్థిక మంత్రులు చిదంబరం, జైట్లీల నడుమ ఆసక్తికర వాగ్వాదం కూడా జరిగింది. ఇక సాక్షి ఫిర్యాదుతో.. ఆధార్ వివరాలను బహిర్గతం చేసిన ఎన్ రోల్ మెంట్ కేంద్రాన్ని పదేళ్ల పాటు నిషేధిస్తున్నట్టు యూఐడీఏఐ (యునీక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా) ప్రకటించింది. ఈ విషయాన్ని యూఐడీఏఐ సీఈఓ అజయ్ భూషణ్ పాండే తెలిపారు. ధోనీ ఆధార్ రిసిప్ట్ ను సోషల్ మీడియాలో ఉంచిన ఎన్ రోల్ మెంట్ కేంద్రాన్ని బ్లాక్ లిస్టులో పెట్టినట్టు ఆయన తెలిపారు.