'లింక్ డ్ ఇన్' కొనుగోలు చేసిన మైక్రో సాఫ్ట్.. చక్పం తిప్పిన సత్య నాదెళ్ల..

 

ఇక నుండి 'లింక్ డ్ ఇన్' టెక్నాలజీ దిగ్గజం మైక్రో సాఫ్ట్ తో కలిసి తన ప్రయాణం సాగించనుంది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల.. లింక్ డ్ ఇన్ కొనుగోలు చేస్తున్నట్టు నిన్న అమెరికాలో ఓ ప్రకటన చేశారు. దాదాపు రూ.2,620 కోట్ల డాలర్లు (రూ.1.75 లక్షల కోట్లు)తో లింక్ డ్ ఇన్ ను సొంతం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. అంతేకాదు తాను మొదటి నుంచి లింక్ డ్ ఇన్ కు పెద్ద అభిమానిని అని పేర్కొన్నారు. లింక్ డ్ ఇన్ తో కలిసి కొత్త అవకాశాలను సృష్టిస్తామని కూడా సత్య ప్రకటించారు.

 

అయితే ఈ డీల్ కుదరడం వెనుక సత్య నాదేళ్ల హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. ఎప్పటినుండో 'లింక్ డ్ ఇన్' ను చేజిక్కించుకునేందుకు మైక్రోసాఫ్ట్ గతంలో చాలా సార్లు యత్నించిందట. కానీ ఫలితం లేదు. అయితే సీఈఓగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత సత్య నాదెళ్ల.. ఆ సంస్థను టేకోవర్ చేసుకునేందుకు ఫిబ్రవరిలో చర్యలు ప్రారంభించారట. విడతలవారీగా జరిగిన చర్చల ఫలితంగా లింక్ డ్ ఇన్ ను మైక్రోసాఫ్ట్ లో విలీనం చేసే పనిని నాదెళ్ల విజయవంతగా ముగించారు.