కేన్సరంటే నాకు భయం లేదు: మనీషా కొయిరాలా
Published on: Fri Dec 7, 2012 4:36PM
.jpg)
బాలీవుడ్ నటి మనీషా కొయిరాలాకు అండాశయ కేన్సర్ అని వైద్యులు నిర్థారించారు. తను అండాశయ కేన్సర్ వ్యాధి బారిన పడిన తర్వాత తొలిసారిగా స్పందించారు. మనీషా ట్విట్టర్ లో తనకు కేన్సర్ కేన్సర్ వ్యాధి అంటే భయం లేదనీ , అభిమానులు కూడా తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దని పేర్కొంది. అభిమానుల ప్రేమాభిమానాలతో తిరిగి తను పూర్తి ఆరోగ్యంతో ఇండియా వస్తానని చెప్పింది . కేన్సర్ వ్యాధి నుంచి కోలుకుంటానన్న నమ్మకం ఉందని పేర్కొంది. తన ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేస్తున్న వారందరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు పేర్కొంది.


