బలపడుతున్న కేవీపీ, జగన్ బంధం!

 

KVP Jagan, jagan mohan reddy, kvp ramachandra rao, congress, ysr congress, telangana state

 

 

కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేవీపీ రామచంద్రరావు వై.ఎస్.రాజశేఖరరెడ్డికి ఆత్మబంధువు. వైఎస్సార్ బతికి వుండగా రాష్ట్రంలో ఆయన వైభవం చూడటానికి రెండు కళ్ళూ చాలేవి కావు. వైఎస్సార్ మరణించాక కేవీపీ జగన్‌కి అండగా వుంటాడని అందరూ అనుకున్నారు. అయితే జగన్ వ్యవహార శైలి నచ్చకపోవడం వల్ల కేవీపీ ఆయనకి దూరమయ్యాడని అంటారు.

 

మొదట్లో జగన్ కేవీపీ చెప్పిన మాట వినకుండా స్వతంత్రంగా వ్యవహరించాడు. సొంత పార్టీ పెట్టిన తర్వాత నాలుగు ఎదుర్రాళ్ళు తగలడంతో జగన్ మళ్ళీ కేవీపీకి స్నేహహస్తం అందించాడని పరిశీలకులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో వున్న కేవీపీ జగన్‌తో తనకున్న అనుబంధాన్ని బాహాటంగా బయటపెట్టరు. ఈమధ్యకాలంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి, జగన్‌కి మధ్య సయోధ్య కుదిర్చి జగన్‌కి బెయిల్ వచ్చేలా చేయడంలో కేవీపీ పాత్ర ఎంతో ఉందనేది బహిరంగ రహస్యం.



కేవీపీ, జగన్ మధ్య మరింత బలపడుతున్న బంధానికి మరో నిదర్శనం తాజాగా వెలుగు చూసింది. రాబోయే ఎన్నికలలో నరసాపురం పార్లమెంట్ స్థానానికి  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కేవీపీ రామచంద్రరావు వియ్యంకుడికి ఆల్రెడీ రిజర్వ్ చేశారట. ఆ టిక్కెట్ కోసం ఎవరు ప్రయత్నించినా జగన్ నో వేకెన్సీ బోర్డు చూపించేస్తున్నాడట. అమ్మ దయ తనమీద ప్రసరించేలా చేసిన కేవీపీ మీద జగన్‌కి అంత అభిమానం ఉండటం న్యాయమే!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu