మిస్‌ అయిన వారి లెక్కతేల్చండి

 

కేధారనాధుడి సాక్షిగా ప్రకృతి సృష్టించిన విలయం ఇంకా కన్నీళ్లు కురిపిస్తూనే ఉంది. వేల మంది ప్రాణాలు విడిచిన ఈ మహావిపత్తులో ఇంకా ఎంతో మంది సర్వం కోల్పోయారు.. ప్రాణాలకు తెగించి సైన్యం అందించిన సహాయక చర్యల్లో లక్షమందికి పైగా సురక్షిత ప్రాంతాలకు చేరినా ఇంకా వేల మంది జాడ తెలియ రావటం లేదు.

అయితే ఈ విషయంలోనే అధికారులు నాయకులు ఇస్తున్న స్టేట్‌మెంట్‌కు పొంతన లేకుండా ఉంది.. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం 400 మంది మాత్రమే మిస్‌ అయ్యారని తెలుస్తుంది.. అయితే ఇందుకు భిన్నంగా నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ వైస్‌ చైర్మన్‌ శశిదర్‌రెడ్డి మాత్రం 11,600 మంది వరకు మిస్‌ అయ్యారని ప్రకటించారు.

ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం మాత్రం వివిధ రాష్ట్రాలనుంచి తమకు అందించిన సమాచారం ప్రకారం కోర్టుకు అందించిన ఎఫ్‌ ఐ ఆర్‌లో 4000 మంది మాత్రమే మిస్‌ అయ్యారని తేల్చింది.. కాని ఓ ప్రైవేట్‌ సంస్థ ద్వారా అందించిన సమాచారం ప్రకారం ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందంటున్నారు.

వీలైనంత త్వరగా ఆ లెక్కలను తేల్చి సాయం అందిచాల్సిందిగా కోరుతున్నారు బాధితులు..