TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కన్నయ్య కుమార్ మరో పోరాటం.. నేటి నుండి నిరాహార దీక్ష

Published on: Wed Apr 27, 2016 12:42PM

 

జెఎన్యూలో రోజు రోజుకి వివాదాలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు తాజాగా మరో వివాదానికి తెర తీస్తున్నారు జెన్యూ విద్యార్ధులు. అఫ్జ‌ల్ గురు ఉరిశిక్ష అమ‌లు పరచి ఏడాది గ‌డిచిన సంద‌ర్భంగా జేఎన్‌యూలో స‌ద‌రు ఉగ్ర‌వాది ఉరితీత‌కు వ్య‌తిరేకంగా విద్యార్ధులు నిరసన కార్యక్రమం నిర్వ‌హించిన సంగతి తెలిసిందే. దీనిపై జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారంపై విచారించిన ఉన్న‌త‌స్థాయి క‌మిటీ క‌న్న‌య్య‌కు రూ.10 వేల జరిమానా విధించింది. అంతేకాదు విద్యార్థులను వ‌ర్సిటీ నుంచి బ‌హిష్క‌రించింది. దీనికి గాను వర్శిటీ విద్యార్ధులు నిరాహార దీక్షకు దిగనున్నారు. దీనిలో భాగంగా నేడు గంగా ధాబానుంచి అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌ వరకూ నిరసన ప్రదర్శన నిర్వహించి, నిరాహార‌ దీక్ష చేపట్టనున్నారు. ఈ సందర్భంగా క‌న్న‌య్య మాట్లాడుతూ.. త‌మ‌పై విచార‌ణ‌కు క‌మిటీని వేయడాన్ని గ‌తంలో తాము వ్య‌తిరేకించామ‌ని, ఇప్పుడు ఆ క‌మిటీ నివేదిక ప్ర‌కారం వ‌ర్సిటీ త‌మ‌పై బ‌హిష్క‌రణ విధించ‌డాన్ని వ్య‌తిరేకిస్తున్నామని వ్యాఖ్యానించారు. మరి ఇది ఎంతవరకూ వెళుతుందో చూడాలి.