జగన్ లోటస్ పాండ్ చేరుకోవడానికి 5 గంటల సమయం

Publish Date:Sep 25, 2013

Advertisement

 

 

 

అక్రమాస్తుల కేసులో 16 నెలల అనంతరం జైలు నుండి విడుదలయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. జైలు నుంచి బయటకు వచ్చిన జగన్ ను చూసేందుకు అభిమానులను భారీ సంఖ్యలో రావడంతో జగన్ వాహనం కదలడం కష్టమయ్యింది. అభిమానులకు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ జగన్‌ కాన్వాయ్‌ ఊరేగింపులా సాగింది. జైలు వద్ద నాలుగు గంటలకు బయలు దేరిన జగన్ లోటస్ పాండ్ లోని తన ఇంటికి చేరుకోవడానికి సరిగ్గా ఐదు గంటల సేపు పట్టింది. జగన్ కు తల్లి విజయమ్మ, ఆయన భార్య భారతీ, చెల్లెలు షర్మిలాతో బంధువులు పెద్ద ఎత్తున జగన్ కి స్వాగతం పలికారు. కార్యకర్తల సందడితో లోటస్ పాండ్ ప్రాంతమంతా కోలాహలంగా మారింది.