బెయిల్ కోసం మళ్ళీ జగన్ పిటిషన్

posted on: Sep 11, 2013 5:56PM

 

jagan bail, jagan bail cbi, jagan assets case, jagan ysr congress

 

 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జగన్ మోహన్ రెడ్డి నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను స్వీకరించిన కోర్ట్ సిబిఐ కి రేపటి లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తాను సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నానని, సిబిఐ తీరు తన స్వేచ్ఛను హరించే విధంగా ఉందని, తాను ఏడాదికి పైగా జైలులో ఉంటున్నానని జగన్ తన బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నారు. రేపు విచారణ జరుగుతుంది. కాగా సిబిఐ మూడు చార్జీషీట్లను మంగళవారం వేయగా,మరో మూడు చార్జీషీట్లు వేయనున్నట్లు చెబుతున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...