జననీరాజనాల మధ్య ఇంటికి చేరిన జగన్

Publish Date:Sep 25, 2013

Advertisement

 

 

 

అక్రమాస్తుల కేసులో 16 నెలల అనంతరం జైలు నుండి విడుదలయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగరంగ వైభవంగా హైదరాబాద్ నగరంలో 12 కిలోమీటర్లు ర్యాలీ చేసుకుంటూ జయజయ ద్వానాల మధ్య 5 గంటల పాటు హంగామా చేసుకుంటూ లోటస్ పాండ్ లోని తన ఇంటికి వెళ్లారు.

 

ఉదయం నుంచే చంచల్‌గూడ జైళు దగ్గర గుమికూడిన జగన్‌ పార్టీ కార్యకర్తలు రాజకీయ సభను తలపించారు. కార్యకర్తలతో పాటు పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు కూడా జైళు వద్ద చేరి జగన్‌ రాకకోసం ఎదురు చూశారు. సాయంత్రం నాలుగంటల ప్రాంతంలో జగన్‌ అభిమానలకు పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ జైళు నుంచి బయటికి వచ్చారు.జగన్‌ జైళు నుంచి బయటి వచ్చిన దగ్గర నుంచే మొదలైంది అసలు కథ, ఎలాంటి ప్రదర్శనలకు అనుమతి తీసుకోక పోయిన ప్రతి కూడలిలో అభిమానులకు, కార్యకర్తలకు అభివాదం చేస్తే జగన్‌ కాన్వాయ్‌ ఊరేగింపులా సాగింది. సాయంత్ర వేల కావడంతో ప్రతి చోట భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. అయితే ప్రదర్శనకు అనుమతి లేకపోయినా ఎక్కడ పోలీసులు జగన్‌ కాన్వాయ్‌ని త్వరగా తీసుకెళ్లే ప్రయత్నం చేయకుండా బలప్రదర్శనకు సహకరించారు.