బూతును ఆపే శక్తి లేదు

 

Internet UGLY Website

 

అంతర్జాలంలో పేరుకుపోతున్న అశ్లీలం పై చేతులెత్తేసిన ప్రభుత్వం.. గత కొంత కాలంగా దేశంలో అమ్మాయిల మీద జరుగుతున్న అత్యాచారాలకు ఇంటర్నెట్‌లో ఉన్న అశ్లీల సాహిత్యాలు, వీడియో ముఖ్యకారణంగా భావిస్తున్నారు విశ్లేషకలు.. అందుకే దానిపై చర్యలు తీసుకోవాల్సిందే ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు..

 

ఈ విషయంపై సుప్రిం కోర్టులో పిల్‌ వేసిన కమ్లేష్‌ వాస్వాని అనే వ్యక్తి పిటీషన్‌ను స్వీకరించిన కోర్టు.. ఆ వెబ్‌సైట్స్‌పై చర్యలు తీసుకోవల్సిందిగా ప్రభుత్వానికి సూచించింది..


కాని కోర్టు ఉత్తర్వుల పై స్పందించిన ప్రభుత్వం సమీపకాలంలో అలాంటి వెబ్‌సైట్స్‌ పై ఎలాంటి చర్యలు తీసుకోలేమని తేల్చిచెప్పేసింది.. ఈ విషయంలో మరిన్ని మినిస్ట్రీస్‌తో సంప్రదించి వారి సాయం తీసుకోవాలని.. కాబట్టి వెనువెంటనే ఆ వెబ్‌సైట్స్‌ని నిషేదించలేమని కోర్టుకు తెలిపింది.

దీని పై తీవ్రంగా స్పందించిన న్యాయస్థానం ఆయాశాఖలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి నాలుగు వారాలలోపు అఫిడవిట్‌ దాఖలు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది..