Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తండ్రి, అన్న అందరూ తక్కువ చేసేవారే...కవిత షాకింగ్ కామెంట్స్
posted on: Mar 8, 2026 6:09PM

హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేక్ కట్ చేసి మహిళలకు శుభాంక్షాలు తెలిపారు. అనంతరం గివ్ హర్ స్పేస్ పోస్టర్ ఆవిష్కరించారు. సీఎం రేవంత్ రెడ్డి "స్టాండ్ విత్ హర్" అనే ప్రొగ్రామ్ తో మహిళలను అవమానించారని కవిత ఆరోపించారు. మగవాళ్లు ఉంటేనే మహిళలు ముందుకు వెళ్తారనేలా కార్యక్రమం చేయటాన్ని ఖండిస్తున్నామని వెల్లడించారు. స్టాండ్ విత్ హర్" కాదు. "గివ్ హర్ స్పేస్" అనేది జాగృతి నినాదమని కవిత తెలిపారు.

ఉమెన్స్ డే ఒక్క రోజు కాదు.. ప్రతి రోజూ మహిళలను గౌరవించాలని ఆమె పిలుపునిచ్చారు. పెద్ద కులం, చిన్న కులం అనేవి ఏమీ లేవు.. మహిళలంతా సమానమే అని చెప్పారు. మహిళ ఏ ఇంట్లో పుట్టినా సరే.. వివక్ష కామన్‌గా కొనసాగుతూ వచ్చింది. తండ్రి, అన్న, భర్త ఇలా అందరూ మహిళలను తక్కువ చేసేవారే. మహిళలు లేకపోతే సృష్టే లేదు అని విషయాన్ని అందరు మర్చిపోయారు అని కవిత గుర్తుచేశారు. మహిళలకు 33 శాతం సీట్ల రిజర్వేషన్ సాధనతో జాగృతి చరిత్ర సృష్టించిందని కొనియాడారు. అంతేకాదు.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై నేరాలు పెరిగాయని కవిత విమర్శించారు.
.webp)


.webp)



