రెండో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా

Publish Date:Jan 15, 2013

 

 

India wins toss, elects to bat against England, India elects to bat, Kochi ODI India wins toss

 

 

కోచిలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో వన్డే లో ఇండియా జట్టు కెప్టెన్ ధోని టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లాండు, భారత్ రెండో వన్డే జట్టులో ఓ మార్పు జరిగింది. ఫాస్ట్ బౌలర్ అశోక్ దిండా స్థానంలో పాకిస్తాన్‌తో జరిగిన చివరి వన్డేలో సత్తా చాటిన పేసర్ షమీ అహ్మద్‌కు తుది జట్టులో చోటు కల్పించారు. ఇంగ్లాండు కూడా ఒక మార్పు చేసింది. టిమ్ బ్రెస్నన్ స్థానంలో క్రిస్ వోక్స్ తుది జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌ను గెలుచుకోవాలని భారత్ ఉవ్విళ్లూరుతున్నా, రెండో వన్డేలోనూ విజయం సాధించి తీరాలని కుక్ సేన పట్టుదలతో ఉంది.

 


ఇండియా: ఎంఎస్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), గౌతం గంభీర్, అజింక్యా రహనే, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, షమీ అహ్మద్

ఇంగ్లాండు
: అలిస్టిర్ కుక్ (కెప్టెన్), జ్యో రూట్, ఇయాన్ బెల్, జడే డెర్న్‌బ్యాచ్, స్టీవెన్ ఫిన్, క్రెయిగ్ కీష్వెట్టర్ (వికెట్ కీపర్), ఇయోన్ మోర్గాన్, సమిత్ పటేల్, కెవిన్ పీటర్సన్, జేమ్స్ ట్రెడ్‌వెల్, క్రిస్ వోక్స్