ఉమ్మడి రాజధానిపై భయపడవద్దు: దిగ్విజయ్

 

hyderabad common capital, Andhra Pradesh Hunt on for capital

 

 

హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించడం పై తప్పుగా అర్ధం చేసుకోవద్దని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్ తెలంగాణ రాజధానిగానే ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లును త్వరగా ఆమోదం పొందేందుకు అందరూ ప్రయత్నించాల్సి ఉంటుందన్నారు.

 

56 ఏళ్లుగా జరుగుతున్న పోరాట ఫలితంగా కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించింది. అంతేకాదు వీలైనంత వేగం రాష్ట్ర ఏర్పాటు జరిగిలే చర్యలను కూడా మొదలు పెట్టింది.. ఈనేపధ్యంలో ఇప్పుడు అంతా కొత్త రాజదాని గురించే మాట్లాడుకుంటున్నారు. పదేళ్ల పాటు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా కొనసాగిన తరువాత ఆంద్ర ప్రాంతానిక రాజధాని కానున్న నగరం గురించే అందరి ఆలోచన.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu