ముందస్తు బెయిల్ కోసం ఎంఎల్ఎ ప్రయత్నం

posted on: Dec 20, 2012 11:45AM

 

 

ఓ కాంగ్రెస్ కార్యకర్త హత్య కేసులో నిందితునిగా ఉన్న గుంటూరు జిల్లా గురజాల ఎంఎల్ఎ యరపతినేని శ్రీనివాస రావు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు.

 

గత నెల 28 న పిడుగురాళ్ళ లో జరిగిన ఉన్నం నరేంద్ర హత్య కేసుకు సంభందించి పోలీసులు ఆయనను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకూ ఇద్దరు నిందితులు లొంగిపోయారు. మరో 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో కొందరు డబ్బుల కోసం ఈ హత్య చేసినట్లు సమాచారం.

 

అయితే, యరపతినేని వాదన మరోలా ఉంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంఎల్ఎ కృష్ణా రెడ్డి పోలీసులఫై వత్తిడి తెచ్చి తనను ఈ కేసులో ఇరికించారని అంటున్నారు. తన బెయిల్ పిటీషన్ లో ఆయన ఇదే అంశాన్ని ప్రస్తావించారు. తన నియోజకవర్గంలో తాను ఇంతవరకూ ఎప్పుడూ హత్యా రాజకీయాలను ప్రోత్సహించలేదని యరపతినేని అంటున్నారు. ఈ బెయిల్ పిటీషన్ విచారణ నరసరావుపేట కోర్టులో జరుగనుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...