శ్రీపతి రాజేశ్వర్ కు బాలకృష్ణ నివాళి
posted on Apr 29, 2013 11:27AM

అనారోగ్యంతో నిన్న కన్నుమూసిన శ్రీ పతి రాజేశ్వర్ బౌతికకాయానికి మారేడుపల్లిలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రభుత్వంలో శ్రీపతి రాజేశ్వర రావు మంత్రిగా పని చేశారు. ఎన్టీఆర్‌కు ఆయన విపరీతమయిన అభిమాని. ఆయన అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘాన్ని స్థాపించారు. దానికి ఆయనే అధ్యక్షుడిగా ఉన్నారు. అరవై ఏళ్ల క్రితమే ఆయన అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేసిన ఆయన ఎన్టీఆర్ పార్టీ పెట్టాక అందులో చేరి మూడుసార్లు శాసనసభ్యులుగా గెలుపొంది, రెండుసార్లు మంత్రిగా పని చేశారు. పార్టీ పెట్టక ముందు నుండే ఎన్టీఆర్‌తో ఆయనకు మంచి అనుబంధం ఉంది. ఎన్టీఆర్ మీద అభిమానంతో శరీరంపై ఆయన ఎన్టీఆర్ బొమ్మను పచ్చ పొడిపించుకున్నారు. నిజాయితీ గల నేతగా ఆయన పేరుంది.