బట్టలిప్పేసిన అమీర్‌ఖాన్!!
posted on Aug 1, 2014 11:55AM

ఇప్పటి వరకూ బాలీవుడ్ సినిమాల్లో సల్మాన్‌కాన్, జాన్ అబ్రహాం, హృతిక్ రోషన్ లాంటి హీరోలు చొక్కాలు మాత్రమే విప్పేశారు. అమీర్ ఖాన్ ఎలాగూ వీళ్ళందరి కంటే పెద్ద హీరో కాబ్టటి, పైగా ఆయన మిస్టర్ పర్‌ఫెక్ట్ కూడా కాబట్టి ఆయన ఏకంగా మొత్తం బట్టలే విప్పేశాడు. అమీర్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హీరానీ నిర్మిస్తున్న ‘పి.కె.’ అనే సినిమా కోసం అమీర్‌ఖాన్ తన బట్టలని పీకేసుకుని నగ్నంగా నిలబడ్డాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ శుక్రవారం విడుదలైంది. అమీర్ ఖాన్ ఒంటిమీద నూలు పోగులేకుండా రైలు పట్టాలపై నిలబడి కోపంగా చూస్తున్నట్టుగా వుంటాడు. అయితే అమీర్ ఖాన్ ప్రేక్షకుల మీద కాస్తంత దయ చూపించాడు. ఎక్కడైతే ఆచ్ఛాదన అవసరమో అక్కడ ఒక పాత టేప్ రికార్డర్ ను మాత్రమే అడ్డు పెట్టుకుని కరుణించాడు. ‘పి.కె.’ సినిమా మొదట్లో అమీర్ ఖాన్ ఇలా దర్శనమిస్తాడట. అనుకోకుండా భూమిపైకి వచ్చిన గ్రహాంతర జీవి పాత్రను ఆమిర్ ఖాన్ ఈ సినిమాలో పోషించాడు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై వ్యంగాస్త్రంగా ఈ సినిమాను హిరానీ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకుముందు ఆమిర్, హిరానీ కాంబినేషన్ వచ్చిన త్రీఇడియట్స్ ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఫస్ట్ లుక్‌తోనే సంచలనం సృష్టించిన ‘పి.కె.’ సినిమా విడుదలయ్యాక ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.ఈ సినిమా 19 డిసెంబర్‌న విడుదలవుతోంది.