మాజీ ఎంపీ ఆత్మహత్య
Published on: Wed Nov 11, 2015 9:46PM

తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు, డీఎంకె పార్టీ నాయకుడు రాజేంద్రన్ చెన్నైలో ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నైలోని కోవిల్‌పట్టి బస్టాండ్ సమీపంలో ఆయన తన కారును పార్క్ చేసుకుని తుపాకితో తలలో కాల్చుకుని చనిపోయినట్టు తెలుస్తోంది. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. రాజేంద్రన్ ఆత్మహత్యతో డీఎంకే వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఈ ఘటన తమిళనాడులో సంచలనం సృష్టించింది.


