తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

posted on: May 30, 2023 10:08AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగింపు దశకు వస్తున్న నేపథ్యంలో తిరుమల గిరులకు భక్తులు పోటెత్తుతున్నారు.

సోమవారం (మే 29)తిరుమల శ్రీవారిని 78 వేల 126 మంది దర్శించుకున్నారు. 37వేల 597 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.74 కోట్ల రూపాయలు వచ్చింది.

 ఇక  మంగళవారం (మే30) ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ టీబీసీ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...