Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టీఆర్ఎస్ లోకి మందా జగన్నాధం!
posted on: Apr 14, 2013 12:58PM

మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు ఎంపీ మందా జగన్నాధం కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారని సమాచారం. శనివారం పాలమూరుకు వచ్చిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో మూడున్నర గంటలపాటు భేటీ అయ్యారు. ఆయన ఈ నెల 27న ఆర్మూర్ లో జరగనున్న టీఆర్ఎస్ ఆవిర్బావ సభలో పార్టీలో చేరతారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నా మరికొంత సమయం పట్టవచ్చని, కాకపోతే ఆయన పార్టీని వీడడం ఖాయమని తెలుస్తోంది. ఆయనతో పాటు మరికొందరు ఎంపీలు టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోనున్నారని సమాచారం. గత మూడేళ్లుగా తెలంగాణ గురించి గట్టిగా మాట్లాడుతున్న మందా కాంగ్రెస్ తెలంగాణను పట్టించుకోవడం లేదని టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్దమయ్యారు. ఆయనతో పాటు మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు త్వరలో కేసీఆర్ పార్టీలో చేరేందుకు మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.


.jpg)
.jpg)


