Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...'ఆమ్ ఆద్మీ'పై కాంగ్రెస్ పగ
posted on: Nov 11, 2013 4:33PM

ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని ఊడ్చేయడానికి 'చీపుళ్ళు' సిద్ధమయ్యాయి. చీపురుకట్ట గుర్తుతో ఎన్నికల బరిలోకి దిగిన 'ఆమ్ ఆద్మీ' పార్టీ ఢిల్లీలో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలాకాలంగా ఢిల్లీని మురికికూపంగా మార్చిన కాంగ్రెస్ పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీ చీపురు ఊడ్చిపారేసే సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తమ పార్టీకి అందుతున్న చందాల విషయంలో చాలా పారదర్శకంగా వ్యవహరించింది. తమకు అందిన చందాల వివరాలను బయటపెట్టింది. అందులో కొన్ని ప్రవాస భారతీయుల నుంచి అందిన చందాలు కూడా వున్నాయి. విదేశాల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి అందిన చందాలపై విచారణ జరిపించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది తమమీద విజయం సాధించబోతున్న 'ఆమ్ ఆద్మీ' పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ మీద కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇది కాంగ్రెస్ మార్కు విచారణ జరిపి, ఆమ్ ఆద్మీ పార్టీని బలహీనపరిచే కుట్రలో భాగమని అభివర్ణిస్తున్నారు. రాజకీయ పార్టీలకు లభించే చందాలను బహిర్గతం చేయాల్సన అవసరం లేదనీ గొంతెత్తి చాటి, పార్లమెంటులో బిల్లు కూడా ఆమోదించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన ప్రత్యర్థి రాజకీయ పార్టీ చందాలపై విచారణ జరిపించాలనుకోవడం విచిత్రంగా వుందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను అరవింద్ కేజ్రీవాల్ తిప్పికొడుతున్నారు. తన పార్టీ చందాలపై విచారణ జరిపించే ముందు కాంగ్రెస్ పార్టీ తనకు వస్తున్న చందాలను బహిర్గతం చేయాలని సవాల్ విసిరారు. చందాల బహిర్గతం విషయంలో కాంగ్రెస్ కిక్కురుమనడంలేదు.


.jpg)
.jpg)


