సీఎం పదవి..బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

 

 

 

"తొమ్మిదేళ్లు ఎవరికీ దక్కని గౌరవం, అవకాశం నాకు దక్కాయి. ముఖ్యమంత్రిగా ఇంతపెద్ద ఆంధ్రప్రదేశ్‌ను ఏకధాటిగా పాలించా. మళ్లీ అలాంటి రాష్ట్రానికి సీఎం కావాలని కోరుకుంటాను తప్పితే.. ఏ జైళ్లనుంచీ బెయిళ్లు.. ఏ కేసుల నుంచీ మాఫీలూ నాకు అవసరం లేదు'' అని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు.

 

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ విధంగా వ్యాఖ్యానించాడు. రాష్ట్రంలో అప్రతిహతంగా సాగుతున్న టీడీపీ ప్రభంజనాన్ని అడ్డుకోవడానికే విభజన కుట్రను తెరమీదకు తీసుకొచ్చారని ఆయన ఆరోపించాడు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపిన తర్వాతనే రాష్ట్ర విభజన గురించి ఆలోచించాలని, కాదని ఏకపక్షంగా ముందుకు పోతే టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోదని హెచ్చరించారు.



ఈనెల 21న తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని, అదే రోజు తిరుపతిలో జరిగే సభలో కాంగ్రెస్, వైసీపీ, టీఆర్ఎస్ కలిసి పన్నుతున్న కుతంత్రాలను బయటపెడతానని చంద్రబాబు అన్నాడు. వచ్చే ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మ పోరాటం సాగిస్తున్న టీడీపీ ఘన విజయం సాధించి తీరుతుందని జోస్యం చెప్పాడు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభిస్తూ చంద్రబాబు ఈ వ్యాఖ్యానాలు చేశాడు.