వరద బాధితుల బాధ వర్ణనాతీతం: చంద్రబాబు

Publish Date:Jun 28, 2013

 

chandrababu, Uttarakhand floods, uttarakhand floods TDP, chandrababu uttarakhand floods

 

 

ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న బాధితుల బాధలు మాటల్లో చెప్పలేమని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. వరద బాధితులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. వరద బాధితులను అదుకోవడానికి ఉత్తరాఖండ్ వెళ్ళిన చంద్రబాబు వారిని పరామర్శించారు. బాధితుల అనుభవాలను బాబు అడిగి తెలుసుకున్నారు.


ఈ రోజు మీడియా తో మట్లాడుతూ...వరద బాధితులకు చాలా భయంకరమైన అనుభవాలు ఎదురైనాయని అన్నారు. పద్మా అనే మహిలా తన కళ్లముందే కుటుంబ సభ్యులు ఐదుగురు వరదలో కొట్టుకుపోతుంటే ఒంటరిగా మిగిలిన ఆమె బాధ వర్ణనాతీతం అని, ఇలాంటి సంఘటనలు కోకొల్లలు జరిగాయని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

 

ఉత్తరాఖండ్‌లో ఒక చోట బాధితులు తిండి నీళ్లు లేక, బాతకాలి కాబట్టి తాము కట్టుకున్న బట్టలతో శవాలు పడిఉన్న నీటిలో బట్ట తడిపి ఆ నీటినే తాగామని తెలిపారని బాబు అన్నారు. మరో మహిళ తన కళ్లముందే తన కుమార్తె వరదలో కొట్టుకుపోయిందని వాపోయింది. ఇదిలా ఉంటే ఢిల్లీ ఏపీ భవన్‌కు చేరుకున్న బాధితులకు అక్కడి అధికారులు సరైన సదుపాయాలు కల్పించలేదని, కనీసం స్నాన, భోజన వసతులు కూడా కల్పించలేదని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.