Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నేటితో ముగియనున్న తొలివిడత ఆత్మగౌరవయాత్ర
posted on: Sep 10, 2013 8:28PM

రాష్ట్ర నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపధ్యంలో తెలుగు జాతి ఆత్మగౌరవయాత్ర చేపట్టిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు యాత్ర బుధవారంతో తొలివిడత ముగియనుంది. తొలి విడతలో భాగంగా గుంటూరు, కృష్ణ జిల్లాల్లో యాత్రను చేపట్టారు బాబు. గుంటూరు జిల్లా పొందుగులలొ చేపట్టిన యాత్ర బుధవారం కృష్ణా జిల్లా తిరువూరులో ముగియనుంది. వెంటనే చంద్రబాబు బయలు దేరి హైదరాబాద్ వస్తారు.
నాలుగు రోజుల విశ్రాంతి అనంతరం రెండో విడత ఆత్మగౌరవ యాత్ర షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు. అయితే రెండో విడత యాత్రకు వెళ్లే లోపు ఢిల్లీకి వెళ్లి వచ్చే అవకాశం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. రెండో విడత యాత్రను పశ్చివగోదావరి జిల్లా ఏలూరు నుంచి ప్రారంభిస్తారు. తొలి విడత ఆత్మగౌరవ యాత్రకు మంచి స్పందన రావటంతో ఇప్పుడు రెండో విడతలో మరింత ఉత్సాహంగా పాల్గొననున్నారు బాబు.


.jpg)



