Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అరుణాచల్ ప్రదేశ్.. ఘోర ప్రమాదం.. 15 మంది మృతి
posted on: Apr 22, 2016 2:32PM
.jpg)
అరుణాచల్ ప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గంత కొద్దిరోజులుగా అక్కడ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో రాష్ట్రంలోని తవాంగ్ జిల్లాలో కొండచరియలు విరిగి... కింద ఉన్న మనుషుల మీద పడటంతో పదిహేను మంది అక్కడి కక్కడే మరణించారు. ఇంకా కొంత మంది కొండచరియలు కింద చిక్కుకొని ఉండగా.. వారిని కాపాడడం కోసం ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. కాగా వారంతా ఓ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం కోసం అక్కడికి వచ్చినట్టు అధికారులు తెలుపుతున్నారు. అరుణా చల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కలికో పుల్, తవాంగ్ జిల్లా డిప్యూటీ కమిషనర్‌ను జరిగిన ఘటనపై పూర్తి నివేదికను ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.



.jpg)


