జగన్ అవిశ్వాస తీర్మానం.. మూజువాణి ఓటుతో ఓటమి..
Published on: Tue Mar 15, 2016 10:08AM

వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. మూజువాణి ఓటుతో అవిశ్వాస తీర్మానాన్నిఓడించింది ప్రభుత్వం. మూజువాణి ఓటుతో అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రకటించి, బడ్జెట్‌పై చర్చను ప్రారంభించారు. దీంతో ప్రతిపక్ష నేతలు స్పీకర్ పోడియం చుట్టూ చేరి ఆందోళన చేపట్టడంతో సభను వాయిదా వేశారు. అయితే న్యాయమూర్తులను కించపరిచే విధంగా జగన్ వ్యాఖ్యలు చేశారని, తాను క్షమాపణ చెప్పాలా..వద్దా అనేది తనకే వదిలేస్తున్నామని అధికార పక్ష నేతలు స్పీకర్ కు తెలిపారు.


