ప్రజాధన౦ సభార్పణం

posted on: Jan 4, 2014 10:52AM

 

 

 

రాష్ట్ర ప్రజల నుంచి వసూళుచేసిన ప్రజా ధనాన్ని రాజకీయ నాయకులు అప్పనంగా ఖర్చు చేస్తున్నారు.. అసెంబ్లీ సమావేశాల పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నాశనం చేస్తున్నారు.

 

తెలంగాణ బిల్లు రాష్ట్ర అసెంబ్లీకి వచ్చిన నాటి నుండి..అసెంబ్లీ సమావేశాలు ఒక్క రోజు కూడా సజావుగా జరగటం లేదు.. తెలంగాణ అంటూ ఒక వర్గం..సమైఖ్య తీర్మానం కావలంటూ మరో వర్గం అసలు చర్చ మొదలు కాకుండానే రచ్చ చేస్తున్నాయి. ఇలా చేసే గొడవలతో సభాసమయం వృధా కావటం తప్ప మరే ఉపయోగం లేదని ఇరు వర్గాలకు తెలిసిన ప్రజలను మభ్యపెట్టడానికే రాజకీయ దొంగలు డ్రామాలడుతున్నారు.



తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో జరిగే చర్యకు కేంద్రంలో ఎలాంటి ఉపయోగంలేదని తెలిసిన మన నాయకులు మాత్రం రాజకీయ చదరంగం ఆపడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజానాల గురించి ఆలోచించాల్సి౦ది పోయి తమ సొంత ప్రయోజనల కోసం సభాసమయాన్ని  ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...