అంబటి రాయుడు సూపర్ సెంచరీ

Publish Date:Feb 10, 2013

 

 

Ambati Rayudu aims to score more centuries, Rest of India in complete control after Ambati Rayudu century

 

 

రెస్ట్ ఆఫ్ ఇండియా ఇరానీ కప్‌ను 25వసారి అందుకునే దిశగా అడుగులేస్తోంది. అంబటి రాయుడు 217 బంతుల్లో 118పరుగుల అజేయ సెంచరీ చేశాడు. అర్ధ సెంచరీలను శతకాలుగా మార్చాల్సిన అవసరం ఉందని తెలుగు తేజం అంబటి రాయుడు అంటున్నాడు. టీమిండియా జట్టులో చోటుకోసం ఆలోచించడడం లేదన్న రాయుడు.. తన బ్యాటింగ్‌తో సంతృప్తిగా ఉన్నానని తెలిపాడు. '50 పరుగులు పైబడి చేసే ఇన్నింగ్స్‌ను శతకాలుగా మార్చాలి. ప్రస్తుతం 27 అర్ధ సెంచరీలు, 14 సెంచరీలు.


భవిష్యత్తులో ఈ నిష్పత్తిని సమం చేస్తా' అని రాయుడు చెప్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో అర్ధసెంచరీ మాత్రమే చేశానని, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌పైనే ధ్యాస నిలపాలి తప్ప పరుగులపై కాదనుకున్నానని తొలిసారి ఇరానీ కప్‌లో ఆడుతున్న రాయుడు అన్నాడు. ఈ సీజన్ తనకెంతో కలిసొచ్చిందంటున్న రాయుడు.. సెంచరీల సంఖ్యను పెంచుకోలేకపోవడం నిరాశ పర్చిందన్నాడు. తన బ్యాటింగ్ శైలిలో కొన్ని మార్పులు చేయడంతో ఇకపై భారీగా పరుగులు రాబట్టగలననే ఆశాభావం వ్యక్తం చేశాడు.