Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కూటమి సర్కార్ విజయోత్సవ సభ రేపటికి వాయిదా
posted on: Jun 12, 2025 5:33PM

కూటమి సర్కార్ ఏడాది పాలన సభ కార్యక్రమం వాయిదా పడింది. ఏడాది పాలన పూర్తి సందర్భంగా విజయవాడలోని ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్‌లో విజయోత్సవ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. అతిరథ మహారధులకు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు కూటమి నేతలు సైతం పాల్గొననున్నారు. అకస్మాత్తుగా అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం జరగడంతో కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఈ మేరకు అధికారులకు సమాచారం అందజేశారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం కారణంగా వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సీఎం చంద్రబాబు నివాసంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వేడుకలను శుక్రవారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.






