Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కాంగ్రెస్ లో కలవరం..... తెలుగుదేశంలో అంతర్మధనం
posted on: Mar 22, 2012 2:33PM
ఏడు నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలకు ఖంగు తినిపించాయి. ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి కవరాన్ని కలిగించగా, తెలుగుదేశంపార్టీలో అంతర్మధానానికి కారణమయ్యాయి. ఈ రెండు పార్టీలు ఏ నియోజకవర్గంలోనూ పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయాయి. ప్రస్తుతం ఫలితాలు త్వరలో జరగనున్న 18 నియోజకవర్గాల ఉప ఎన్నికలపైన ప్రభావం చూపిస్తాయనిరాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2014లో జరిగే ఎన్నికలకు ఈ 18 నియోజకవర్గాల ఉప ఎన్నికలు సెమీ ఫైనల్స్ లాంటివని, ఇక్కడ కూడా కాంగ్రెస్, టిడిపిలు విఫలమైతే రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించడం ఖాయమని భావిస్తున్నారు.
తెలంగాణా ప్రాంతంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశంపార్టీల నాయకులు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం అయితే చేయగలిగారు కాని ఓటర్లను ఆకట్టుకోలేకపోయారు. ఇక్కడ ఆరు స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో మూడుచోట్ల టిడిపి డిపాజిట్ లు కోల్పోయింది. ఒక్క స్టేషన్ ఘన్ పూర్ లో మాత్రమే రెండవస్థానంలో నిలిచింది. మహబూబ్ నగర్ లో ఘోరంగా నాలుగవ స్థానానికి దిగజారింది. తక్కిన చోట్ల మూడవస్థానంలో నిలిచింది.... మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ మూడు, టిడిపి నాలుగస్థానంలో నిలువగా, నాగర్ కర్నూల్, కొల్లాపూర్, అదిలాబాద్, కామారెడ్డి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ రెండవస్థానంలో నిలిచాయి. స్టేషన్ ఘన్ పూర్ లో మాత్రం కడియం శ్రీహరి రెండవస్థానాన్ని దక్కించుకోగలిగారు. నెల్లూరుజిల్లా కోవూరులో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఓటమికి కాంగ్రెస్, టిడిపిలు విశ్వా ప్రయత్నాలు చేశాయి. అయినా ఆయనను ఓడించలేకపోయాయి. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి పి. శ్రీనివాసరెడ్డి మూడవస్థానంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. ఈ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి వై. శ్రీనివాసరెడ్డి మహబూబ్ నగర్ నియోజకవర్గంలో గెలుపొందడం గమనించదగ్గ విషయం. తెలంగాణా వాదం ఒక్క టి.ఆర్.ఎస్. గుత్త సొత్తు కాదని బిజెపి నిరూపించింది. ఈ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి శ్రీనివాసరెడ్డికి 39,272 ఓట్లు రాగా, టిఆర్ఎస్ అభ్యర్ధి ఇబ్రహీంకు 37,377 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధి ఎం. ప్రకాష్ కు 27,308 ఓట్లు, టిడిపి అభ్యర్ధి చంద్రశేఖర్ కు 17,506 ఓట్లు వచ్చాయి.


.jpg)


