TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భూవివాదంలో ప్రియాంక గాంధీకి నోటీసులు...

Published on: Fri Apr 29, 2016 12:54PM

 

ఇప్పటికే నేషన్ హెరల్డ్ కేసులో.. ఇప్పుడు తాజాగా అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాఫ్టర్ల కుంభకోణంలో సోనియాగాంధీ ఆరోపణలు ఎదుర్కొంటుంటే.. ఇప్పుడు ఆమె కూతురు ప్రియాంక గాంధీ కూడా మరో వివాదంలో ఇరుకున్నారు. ఓ భూవివాదంలో ప్రియాంక గాంధీకి కోర్టు నోటీసులు జారీ అయినట్టు తెలుస్తోంది. అసలు సంగతేంటంటే.. ప్రియాంక గాంధీ హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో ఓ భూమిని కొనుగోలు చేశారు. అయితే ఆ భూమికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కోర్టుకు తెలియజేయాలని.. అసలు ఎందుకు తెలియజేరాదో కూడా చెప్పాలని చెపుతూ.. దీనిపై నాలుగు వారాల్లోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.

 

కాగా సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడు దేవాశీష్ భట్టాచార్య అనే వ్యక్తి భూమికి సంబంధించిన వివరాలు అదంజేయాలని ధరఖాస్తు చేశారు. అయితే దీనిని సవాల్ చేస్తూ ప్రియాంక గాంధీ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు దీనిపై విచారించిన హైకోర్టు పైవిధంగా తెలిపింది. ప్రస్తుతం గాంధీ కుటుంబానికి ఇది గడ్డుకాలంలా ఉన్నట్టుంది.