Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రధాని మోదీని అభినందిస్తూ ఎన్డీయే సీఎంలు తీర్మానం
posted on: May 25, 2025 5:55PM
.webp)
ఆపరేషన్ సింధూర్ విజయంలో సాయుధ బలగాలు, మోదీ నాయకత్వాన్ని అభినందిస్తూ ఒక తీర్మానాన్ని శివసేన నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రవేశపెట్టారు. ఆపరేషన్ సిందూర్‌తో దేశ ప్రజల్లో నైతిక స్థైర్యం, ఆత్మస్థైర్యం పెరిగిందని ఆ తీర్మానం పేర్కొంది. మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, సాయుధ బలగాలను ప్రధాని వెన్నంటి పోత్సహిస్తూ వచ్చారని, ఉగ్రవాదులు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారికి ఆపరేషన్ సిందూర్ గట్టి సమాధానం ఇచ్చిందని తెలిపింది.
ఆపరేషన్ సింధూర్ విజయంలో భద్రతా బలగాలు, ప్రధాని మోదీ నాయకత్వాన్ని అభినందిస్తూ ఎన్డీయే రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని మిగతా నేతలు ఆమోదించారు. ఎన్డీయే ( పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కేంద్రమంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
దేశవ్యాప్తంగా కుల జనగణన చేపట్టడంపై మరో తీర్మానం చేశారు. సమావేశంలో భాగంగా.. ఆపరేషన్ సిందూర్‌పై కాంగ్రెస్ సహా విపక్షాలు చేసిన విమర్శలను తిప్పికొట్టే అంశంపై చర్చలు జరగనున్నట్లు సమాచారం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందే మాట్లాడుతూ..ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రధాని సాయుధ దళాలకు అధికారాను ఇచ్చి..ముందుకు నడిపించారని కొనియాడారు . ఎన్డీయే రాష్ట్రాల సీఎంలతో సమావేశం తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ సమావేశంలో కుల జనగణనపై ప్రధాని మోదీ నిర్ణయాన్ని ప్రశంసించామని వారు తెలిపారు. వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ సాకారం లక్ష్యంగా అందరు కలిసి పనిచేయాలి అని తెలిపారు.






