Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రియురాలి చెల్లిలిపై కన్నేసి అందర్నీ కాల్చిపారేసిన ప్రియుడు
posted on: Sep 4, 2012 12:01PM
ఢిల్లీకి చెందిన రవి, రేణు అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. రెండేళ్లుగా రేణుతో ప్రేమాయణం నడుపుతున్న రవి కన్ను ఆమె చెల్లెలు బేబీపై పడింది. ఆమెను తనకిచ్చి పెళ్లి చేయమని రేణును కోరాడు. ఆమె ఒప్పుకోలేదు. దీంతో కోపం పెంచుకున్న రవి సోమవారం ఉదయం తొమ్మిదిగంటలకు ఢిల్లీలోని బిందాపూర్‌లో ఉన్న రేణు ఇంటికి వెళ్లి ఆమెను, ఆమె భర్త నవీన్‌ను కాల్చి చంపేశాడు. తుపాకీ శబ్దాలు విని లోపలి వచ్చిన ఇంటి యజమాని షీలానికూడా కాల్చిపారేశాడు. తర్వాత అక్కడికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న భోజాపూర్ కు చేరుకున్నాడు. అక్కడ రేణు తండ్రి హరేందర్, సోదరి బేబీ ఉంటున్న ఇంటికి చేరుకుని వాళ్లిద్దరినీ కాల్చేశాడు. తరువాత తను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.


.jpg)
.jpeg)


