జైలు వాకిట్లో జనం డబ్బు చెట్టు....జగన్ పై

 jagan jail, jagan ysrcongress, jagan assets case, jagan chanchalguda jail

 

స్వామి నిత్యానందకు వ్యంగంగా స్వాగతం పలుకుతూ రాష్ట్రంలో అందరిని ఆకర్షించిన గుంటూరుకు చెందిన ‘ది మూన్ సేన’ తాజాగా తన తాజా అస్త్రాలను వైఎస్ జగన్ మీద ఎక్కుపెట్టింది. ఈ సంఘటన గుంటూరులో కలకలం రేపింది. జైలు వాకిట్లో జనం డబ్బు..అంటూ ఓ ప్లెక్సీని ఏర్పాటు చేసిన మూన్ సేన దాని మీద ఇలా రాసింది. ఏముందక్కడ..బెల్లం ముక్క..పోతున్నారెందుకో ఈగల్లెక్క..ఐదేళ్లకు ఓటేశాం మనుషుల లెక్క…అధికారం ఇచ్చాం మనమే పక్కా..అమ్ముడుపోతున్నారు సంతలో పశువుల్లెక్క..ఎంఎల్ఏ అయితేనే అంతటి లక్కా ? అంటూ రాష్ట్రంలో పార్టీలు మారుతున్న ఎంఎల్ఏలపై విమర్శనాస్త్రాలు విసిరారు.



జనం సొమ్ముతో ఆకర్ష్ జాతర..ప్రజాస్వామ్య విలువలకు పాతర అంటూ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ ప్లెక్సీ గుంటూరులో సంచలనం అయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు దీని మీద మండి పడ్డారు. కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు ఆ ప్లెక్సీని ఏర్పాటు చేశారు. ది మూన్ సేన ప్రతినిధి రాజేంద్ర పలు ఫోన్ల ద్వారా బెదిరింపులు చేశారు. నీ సంగతి చూస్తాం అని హెచ్చరించారు. దీని మీద పో లీసులు కేసు కూడా నమోదు చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu