మిథున రాశి- మృగశిర 3,4 (కా, కి)

ఆర్థ్ర 1,2,3,4 (కు,ఖం, జ్ఞ, చ్ఛ), పునర్వసు 1,2,3 (కే,కో,హ)

ఆదాయం: 5     వ్యయం: 5    రాజపూజ్యం: 3   అవమానం: 6

    ఈ రాశి వారికి గురువు వత్సరాది 12-09-2017 భాద్రపద ఒ|| సప్తమి మంగళవారం వరకు 4వ స్థానంలో సువర్ణమూర్తియై ఉండును, తదుపరి వత్సరాంతము పంచమమున లోహమూర్తియై ఉండును.శని వత్సరాది 20-06-2017 జ్యేష్ఠ ఒ|| ఏకాదశి మంగళవారము వరకు 7వ స్థానమున, తదుపరి 26-10-2017 కార్తీక. శు|| షష్ఠి గురువారం వరకు వక్రగతుడై 6వ స్థానమున సువర్ణమూర్తిగా ఉండును. తదుపరి వత్సరాంతం 7వ స్థానమున తామ్రమూర్తియై ఉండును. రాహుకేతువులు 17-08-2017 వరకు రాహువు 3వ స్థానమున కేతువు 9వ స్థానమున లోహమూర్తులుగాను తదుపరి వత్సరాంతము రాహువు  2వ స్థానమున కేతువు 8వ స్థానమున సువర్ణ మూర్తులై ఉండును.

    ఈ విధమైన గ్రహస్థితి పరిశీలించి చూడగా ఈ సంవత్సరము ప్రయాసచే పనులు పూర్తి చేయుదురు. సంవత్సరము ఆరంభములో ప్రతి విషయానికి శ్రేయోభిలాషుల సలహా తీసుకోవాలి. శని స్థితి మిశ్రమముని ఉన్ననూ మూర్తి నిర్ణయము చేత కొంత మేలు జరుగును. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధ అవసరము. వైద్య పర్యవేక్షణము, ఔషద సేవనము చేయవలసిన పరిస్థితి ఉత్పన్నము కావచ్చును. మీ ఆరోగ్య విషయంలో కూడా తగు శ్రద్ధ అవసరం. ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. ప్రేమికుల మధ్యన అభిప్రాయ భేదాలు రావచ్చు. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి.

    విదేశీ ప్రయత్నాలు 2వ ప్రయత్నంగా ఫలించగలవు. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి కూడా కొంత ప్రయత్న సంతరము కలుగగలదు. పశ్చిమ దిక్కుకు ప్రయాణములు చేయవలసిన అవసరాలు. ఋణబాధల నుండి ఒక అమృతహస్తం వల్ల బయటపడతారు. రోగ నివృత్త కలుగుతుంది. మేనమామ గారి ఆరోగ్యము విషయంలో జాగ్రత్తలు అవసరం ఇతర సంప్రదాయస్థులతో స్నేహాలు, సంతానము యొక్క ఆరోగ్య విషయమై ధనం ఖర్చు చేయవలసిన పరిస్థితి, స్త్రీలు ముఖ్యముగా గర్భవతులు తమ ఆరోగ్య విషయంలో ఏ మాత్రం అశ్రద్ద పనికిరాదు. కొన్ని పరిస్థితులలో అర్థంకాని మానసిక స్థితి ఎదురుకుంటారు. ముఖ్యముగా వివాహ నిశ్చయ విషయంలో (వధూవరులు) నిర్ణయం తీసుకోవడం సమస్యగా మారుతుంది.

 

స్త్రీ మూలక భయము, గర్భధారణ మేరకు వైద్యుణ్ణి సంప్రదించడం ఔషధ సేవనము, నేత్రబాధ ఎదురుకావచ్చును. సరియైన వైద్యుడిని సంప్రందించుట ఉత్తమము. అశ్రద్ధ పనికిరాదు. అగ్ని, విద్యుత్తుతో జాగ్రత్తగా ఉండాలి. మాటలు వాడిగా వేడిగా రాకుండా  జాగ్రత్తపడండి. వైరాగ్యభావాలు రావచ్చును. వత్సరాంతములో విదేశీ ప్రయత్నాలు లభించవచ్చును. సఫలము కావచ్చును. పురాతన సంప్రదాయ విషయాలు, పురాణాలు ఇతిహాసాల పై ఆసక్తి, పుస్తక పఠనము, షేర్‌ మార్కెట్‌లో కొంత సత్ఫలితము. వ్యవసాయ క్షేత్ర లాభము, ఉద్యోగములో స్థాయి పెరుగుట ఫలితము. ఈ సంవత్సరము కపడుతుంది. విద్యార్థులకు పూర్వార్థము కన్నా ఉత్తరార్థము బాగుంటుంది. పోటీ పరీక్షలలో సత్ఫలితాలు సాధిస్థారు. ఈ సం||ము ఈ రాశివారలు ఒకనెల అయినా గోసేవకు సహాయము చేయండి. ఒక వృక్షాన్ని పెంచండి. వృద్ధులకు, అంధులకు పేద విద్యార్థులకు వికలాంగులకు వీలయినంత సహాయము చేస్తూ సదాచారము సజ్ఞన సాంగత్యము శాస్త్రహితమైన పరిహారాలు చేస్తూ నిత్యం ప్రత్యేక శనిస్తోత్రం రాహు, కుజ, గురు, రవి, ధ్యాన శ్లోకాలను పఠించండి. హనుమాన్‌ చాలీసా మరువద్దు.

    ఈ సంవత్సరము వారికి చాలా విషయాలతో సర్దుకుపోయే మనస్తత్వము కల్గియుండుట శ్రేయస్కరము. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ వృధా ఖర్చులు చేస్తారు. ఈ విషయంలో ఒకింత జాగ్రత్త అవసరము. తమ శ్రేయోభిలాషులు, స్నేహితులు, మిమ్ములను అమితంగా ఇష్టపడే వారి యొక్క మాటలను సూచనలను పట్టించుకోకపోవడం ఇబ్బందికరంగా పరిణమించవచ్చును. గోముఖ వ్యాఘ్రాలను నమ్మి మోసపోయే అవకాశము గలదు. అవకాశము ఉన్నదని, అయూచిత ఋణము లభిస్తున్నదని అనాలోచితముగా ఋణములు చేసే అవకాశము గలదు. తస్మాత్‌ జాగ్రత్త. నూతన పరిచయాలు ఇబ్బంది గలిగించవచ్చును. కొత్త వ్యాపారాలతో పెట్టుబడులు పెట్టునపుడు ఒకింత ఆలోచించండి. స్వయంకృతాపరాధము సంభవించవచ్చును. ప్రస్తుత తమ స్థాయిని తగ్గించడానికి అనేక ప్రయత్నాలు జరిగే అవకాశము గలదు. బాధ్యతలను విస్మరించకుండా జాగ్రత్త పడండి.

 

మానసిక ప్రశాంతత లోపించవచ్చును. మనుష్యులు ఈ విధంగా కూడా ఉంటారా ! అని ఆశ్చర్యం కలుగుతుంది. దీనికి కారణం కొన్ని సందర్భాలలో మీ శ్రేయస్సు కోరే వారిని విస్మరించడమని తెలుసుకోవాలి. ఆస్తులు, భవనాలు మొదలైన వాటిని వృద్ధి చేసుకోవాలని ఆరాటము ఎక్కువౌతుంది. విలాసాలు, సువర్ణాభరణముపై ఆసక్తి పెరుగుతుంది. తాము అనుకున్నది సాధించడానికి కొంత వక్రమార్గ ఆచరణ కూడా చేయవలసిన పరిస్థితి రావచ్చు. ఆస్తులు మార్పిడి చేసే అవకాశము గలదు. భూవ్యాపారాలు కొంతవరకు లభిస్తాయి. మధ్యవర్తిత్వాలు, మధ్యవర్తి వ్యాపారాలు కొంతవరకు లభిస్తాయి. ఏమి చేసి అయినా అవాంతరాలు ఎదురైనా తోటి వారిలో మీ స్థాయిని పెంచుకునే ప్రయత్నము చేస్తారు. సఫలమవుతారు. సంప్రదాయ విషయాలపై ఆసక్తి, శ్రద్ధ చూపిస్తారు.

 

వ్యాపారాన్ని స్వంతంగా నిర్వహించాలని ప్రయత్నాలు చేస్తారు. వ్యాపార భాగస్వాములను దూరంగా ఉంచాలని ప్రయత్నాలు చేస్తారు. రాజకీయ పరపతి ఉన్నత వ్యక్తుల పరిచయాలు ఏర్పడుతాయి. మీకంటూ ఒక వర్గాన్ని స్థిరపరుచుకుంటారు. నతన భవన నిర్మాణానికి బ్యాంక్‌ ఋణాలకై ప్రయత్నాలు చేస్తారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మాకూడదో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. శక్తికి మించిన కార్యాలు చేయవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. పేరుప్రతిష్టలకు లోపం ఉండదు. దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది. ప్రతిష్టలకు లోటు ఉండదు. రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉన్నవారి వల్ల మీకు విశేషంగా సహకారం లభించవచ్చును. కండరాలు, కీళ్ళ నొప్పులు అవస్థలు మాత్రం భరించక తప్పదు. బిపి, షుగర్‌ వంటి వ్యాధుల విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ, అజాగ్రత్త పనికిరాదు. నూతన విద్యల పై ఆసక్తి చూపిస్తారు.

    సెప్టెంబరు నుండి బృహస్పతి బలము కొంత వరకు ఉపముక్తిను కాగలదు. మీకు చాలా వరకు శుభము కనబడుచున్నవి. మీ ఆత్మ స్ధైర్యము మీకు శ్రీరారక్షయని తెలుసుకొనండి. మీలో వీన్న సృజనాత్మకత సమయోచిత నిర్ణయాలు అనేక నిర్ణయాలలో మీకు సహాయపడవచ్చు పంచమ  బృహస్పతిచే ఇష్ట కామ్యార్థ సిద్ధి ఏర్పడుతుంది. ఇష్ట దేవతా అనుగ్రహము, కుల విద్యపై ఆసక్తి పెరుగుతుంది. విద్యా విషయంలో అనేక క్రొత్త నిర్ణయాలకు శ్రీకారము. ధనప్రాప్తి అనూహ్య ధనాగమము సూచన కనిపించుచున్నది. కార్యానుకూలత బంధువర్గములో మీ పేరు ప్రతిష్ఠ పెరుగవచ్చును. శారీరక సౌఖ్యము కలుగవచ్చును. మీ యొక్క స్థాయి కూడా పెరుగువచ్చును. మీరు పనిచేయు సంస్థలో కొంత మందిపైన అధిపత్యము వహిస్తారు. అవివాహితులకు వివాహ ప్రాప్తి, సంతానప్రాప్తి. వస్త్ర భూషణ ప్రాప్తి, సమాజములో గౌరవము పెరుగుతుంది.

 

ఉద్యోగములో ప్రమోషన్లు లభించవచ్చును. వ్యాపారములో నూతన మార్గాన్వేషణ, అందులో సఫలమవుతారు. గతంలో ఇచ్చిన ధనం తిరిగి చేతికి అందుతుంది. కాని అంచెలంచెలుగా అందవచ్చును. నూతన గృహ నిర్మాణానికై బ్యాంకుల ద్వారా ఋణ సదుపాయము  లభించగలదు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వారి పరిచయాలు కలుగుతాయి. తీర్ధయాత్రలు చేస్తారు. సజ్జనసాంగత్యం మీరు చేసిన పనికి తగిన సత్కారము, పురస్కారము లభించ వచ్చును. మీ యొక్క వ్యక్తిగత గౌరమునకై చేయ ప్రయత్నాలు ఫలిస్తాయి.

    స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. సమాజంలో గతంలో నష్టపోయిన పరపతిని ప్రతిష్టను తిరిగి పొందుతారు. ఎవరైతే గతంలో అవమానపరిచారో వారు నిజము తతెలుసుకొని పశ్చాత్తాప పడతారు.  దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మానసిక ఆనందముచే చక్కని స్థిర నిర్ణయాలు తీసుకుంటారు. దాంపత్య సౌఖ్యము ఏర్పడుతుంది. గతంలో ఉన్న అపోహలు, అవమానాలు సమసిపోతాయి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ప్రస్తుతమున్న ఆదాయానికి మరొక ఆదాయము తోడవును. తెలివితో చాకచక్యంతో శత్రువులపై అధిపత్యాన్ని సాధిస్తారు. వారు తీసుకున్న గోతిలో వారే పడేలా ఎత్తుకు పైఎత్తులు వేస్తారు. అవివాహితులకు చక్కని వివాహ సంబంధాలు నిశ్చయము అవుతారు. మానసిక సంతృప్తి ఏర్పడుతుంది. సంతానప్రాప్తి కలుగుతుంది. పుత్రసంతాన ప్రాప్తి సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వారి పరిచయాలు ఏర్పడుతాయి. మీకు ఉన్నత గౌరవాలు స్థాయి దక్కుతుంది. విలువైన విలాస వంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో అనేక రకాలైన క్రొత్త మార్గాలు అవలంభించి వ్యాపారంలో లాభాలు సాధిస్తారు. నష్టాలలో ఉన్న వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపిస్తారు. సమాజంలో ముఖ్యమైన అనవసరమైన కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఉన్నతస్థాయి అధికారుల ప్రశంసలు పొందుతారు. అదనపు, బాధ్యతలు నిర్వహించవలసి వస్తుంది. పని తీవ్రత, వత్తిడి పెరిగే అవకాశము గలదు.

 

ఉద్యోగంలో ఉన్నతస్థాయికి (ప్రమోషన్‌) ఎదుగుతారు. నూతన వాహనాలు సమకూర్చుకుంటారు. చరాస్తులు వృద్ధి పరుచుకుంటారు. ప్రేమ వివాహాలు సఫలము కావచ్చును. నూతనంగా వ్యాపారపరంగా భూములపై బంగారంపై లేదా షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడతారు. తమ సంతానానికి వారి భవిష్యత్తుకై పటిష్టమైన ప్రణాళికను సిద్ధం చేసి అమలు పరుస్తారు. ఉన్న శని ప్రభావము వలన అనేక విషయాలలో మీదే పై చేయి అవుతుంది. గతంలో విమర్శించిన వారు ప్రశంసిచడం చూసి ఆశ్చర్యపడతారు. మీ అంచానాలకు మించి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. శతృవులు స్తబ్ధులై ఉంటారు. సుఖ, సౌఖ్యాలు పరిస్థితులను మీకు అనుకూలంగా మలుచుకుంటారు. జీవిత భాగస్వామితో చక్కని అనురాగ పూరితమైన వాతావరణం ఏర్పడుతుంది. శయ్యా సౌఖ్యము లభిస్తుంది. జనాకర్షణ పెరుగుతుంది. ప్రభుత్వపరంగా మీకు అందవలసిన ప్రయోజనాలను అందుకుంటారు. రాజకీయ లబ్ధి, పరపతి ఏర్పడుతుంది. నూతన గృహ నిర్మాణానికై మీరు చేయు కృషి ఫలిస్తుంది. మీ వృత్తికి తగిన మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. కళాకారులకు చక్కని అవకాశాలు లభిస్తాయి. విలాసవంతమైన ఖరీదైన జీవితము గడిపే అవకాశాలు లభిస్తాయి. నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశము గలదు. వ్యాపార భాగస్వాములపై మీదే పై చేయిగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నము సఫలమౌతుంది.

 

తనకు మాలిన ధర్మం చేయరాదని శాస్త్ర  వచనం ఈ విషయాన్ని అక్షరాలా పాటించండి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంటా ఉంటాయి. గతంలో మధ్యలో వదలివేసిన పనులను మళ్ళీ ఆరంభిస్తారు. గతంలోని మీ ప్రవర్తనకు ప్రస్తుత ప్రవర్తనకు తేడాను చూసి మీరే ఆశ్చర్యపడతారు. గతంలో ఏర్పడిన కోర్టు వివాదాలు, కేసులు మొదలైన వాటిని సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకుంటారు. అత్యుత్సాహంతో పేరు ప్రతిష్టల కొరకు వెనకా, ముందు ఆలోచించక వృధాగా ధనాన్ని దుర్వినియోగపరిచే అవకాశాలున్నాయి. నూతన ఉద్యోగంలో కొంత పని వత్తిడి. అసంతృప్తి ఉంటుంది. చేయక తప్పని పరిస్థితి ఉంటుంది.    మానవత్వంతో సజ్జన స్వాంగత్యంతో సత్కార చరణంతో స్వధర్మానుష్టంతో ఉండండి. శమీ బిల్వ వృక్షాలని శని వృషం, బిల్యష్‌లని పెంచుతూ పోశిస్తూ, ఆరాధిస్తూ, పూజించండి. శని, గురు, కేతు, రాహు ధ్యాన శ్లోకాలని పఠించండి. ఇంకా ఉత్తమ ఫలితాల కొరకు శ్రీరామరక్షాస్తోత్రం చేయండి.


More Rasi Phalalu 2017 - 2018