Home » Yoga » సోమాటిక్ యోగా అంటే ఏంటో తెలుసా!
సోమాటిక్ యోగా అంటే ఏంటో తెలుసా!
.webp)
భారతీయ ఋషులు అందించిన గొప్ప ఆధ్యాత్మిక సంపదలో యోగా ప్రముఖమైనది. యోగా వల్ల భారతీయ ఋషులు, ఆధ్యాత్మిక వేత్తలు వందల సంవత్సరాల పాటు బ్రతికారని చెబుతారు. పురాణ గ్రంథాలలో కూడా యోగా ను ఒక ప్రసిద్ధ మార్గంగా, గొప్ప జీవన మార్గంగా వర్ణించారు. అయితే యోగాలో సోమాటిక్ యోగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సోమాటిక్ యోగా అంటే ఏంటి? దీని వల్ల కలిగే ప్రయోజాలు ఏంటి? తెలుసుకుంటే..
సోమాటిక్ యోగా..
సోమాటిక్ యోగా అనేది శరీరం బయటకు ఫిట్ గా ఉండటం కంటే కూడా శరీరంలో అంతర్గతంగా అంటే.. శరీరం లోపల ఎంత సౌకర్యంగా ఉంది అనే విషయం పై దృష్టి సారించే ప్రత్యేక యోగాభ్యాసం. సోమాటిక్ అనే పదం గ్రీకు పదం సోమ అనే పదం నుండి వచ్చింది. గ్రీకులో సోమ అంటే జీవించే శరీరం అని అర్థం.
సాధారణ యోగాలో.. భంగిమలు ఉంటాయి. వీటినే ఆసనాలు అంటారు. సాధారణ యోగాలో ఈ ఆసనాలు సరిగ్గా వేయడం అనే విషయంపై, ఆసనం పొజిషన్ పై దృష్టి పెడతారు. అయితే సోమాటిక్ యోగాలో ఒక ఆసనం భంగిమలో ఉన్నప్పుడు శరీరం లోపల ఎలా అనుభూతి చెందుతోంది అనే విషయం పైన దృష్టి పెడతారు.
సోమాటిక్ యోగాలో జరిగే ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా, చాలా సూక్ష్మంగా, సున్నితమైన కదలికలు కలిగి ఉంటుంది. దీని ప్రధాన ఉద్దేశ్యం మెదడు, కండరాలను తిరిగి అనుసంధానించడం.
ఒత్తిడి కారణంగా తెలియకుండానే కొంతమందికి కండరాలు బిగుసుకుపోయి ఉంటాయి. ఇవి దీర్ఘకాలం పాటు నొప్పిని కలుగజేస్తూ ఉంటాయి. ఈ నొప్పిని తగ్గించడంలో సోమాటిక్ యోగా సహాయపడుతుంది.
సోమాటిక్ యోగా శరీరంలో పేరుకుపోయిన గతం తాలుకూ గాయాలు, ఉద్వేగాలు, మానసిక ఒత్తిడి, మానసిక ఉద్రిక్తత వంటి సమస్యలను బయటకు పంపి మానసికంగా మెరుగ్గా ఉండటంలో సహాయపడుతుంది. తద్వారా మానసిక సమస్యలు తగ్గుతాయి.
శరీరంలో ఉండే పారాసిపథెటిక్ నాడీవ్యవస్థను సక్రియం చేయడంలో సోమాటిక్ యోగా సహాయపడుతుంది. ఇది మనసుకు లోతుగా శాంతిని చేకూర్చుతుంది, మంచి నిద్రకు సహాయపడుతుంది.
*రూపశ్రీ.
