Home » Beauty Care » ఫేస్ ప్యాక్ Vsఫేస్ మాస్క్: రెండింటి మధ్య తేడాలు తెలుసా.. చర్మానికి ఏది మేలంటే!
ఫేస్ ప్యాక్ Vs ఫేస్ మాస్క్.. రెండింటి మధ్య తేడాలు తెలుసా.. చర్మానికి ఏది మేలంటే!

నేటికాలంలో ప్రతి ఒక్కరూ కాంతివంతమైన, ఆరోగ్యకరమైన చర్మాన్ని కోరుకుంటున్నారు. దీనికోసం రకరకాల చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగిస్తారు. సాధారణంగా ఫేస్ మాస్క్ లు, ఫేస్ ప్యాక్ లు ఉపయోగిస్తుంటారు. ఫేస్ మాస్క్‌లు, ఫేస్ ప్యాక్‌లు రెండూ చర్మ సంరక్షణకు ప్రయోజనకరమైనవే, అవి చేకూర్చే ప్రయోజనాలు వేర్వేరుగా ఉంటాయి. అందువల్ల అవసరాలకు అనుగుణంగా వీటిని ఎంచుకోవడం చాలా ముఖ్యం.
సరిగ్గా ఉపయోగించినట్లయితే, రెండూ చర్మాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా, కాంతివంతంగా చేస్తాయి. కానీ చాలామంది ఈ రెండూ ఒకటే అని, ఫేస్ ప్యాక్, ఫేస్ మాస్క్ మధ్య తేడా ఏమీ లేదని అనుకుంటారు. అయితే అవి చేకూర్చే ప్రయోజనాలు, వాటిని ఉపయోగించే విధానం భిన్నంగా ఉంటుంది. ఫేస్ ప్యాక్, పేస్ మాస్క్ మద్య తేడాలు ఏంటి? వీటిని ఎలా ఉపయోగించాలి? పూర్తీగా తెలుసుకుంటే..
పేస్ ప్యాక్..
ఫేస్ ప్యాక్‌లను సాధారణంగా సహజమైన లేదా ఇంట్లో తయారుచేసిన పదార్థాలతో తయారు చేస్తారు. ఫేస్ ప్యాక్‌ల ప్రధాన ఉద్దేశ్యం చర్మానికి పోషణనిచ్చి, నూనెను నియంత్రించడం. ఫేస్ ప్యాక్ లలో తరచుగా కింది పదార్థాలు ఉంటాయి.
ముల్తానీ మట్టి
శనగ పిండి
పసుపు
పెరుగు
చందనం పొడి.. ఇవి మాత్రమే కాకుండా చర్మ రకాన్ని, చర్మానికి అవసరాన్ని బట్టి చాలా పదార్థాలు ఫేస్ ప్యాక్ లో ఉంటాయి.
ఫేస్ ప్యాక్ వల్ల కలిగే ప్రయోజనాలు..
చర్మాన్ని లోతుగా శుభ్రపరచడంలో ఫేస్ ప్యాక్ లు సహాయపడతాయి. ఇవి చర్మం మీద అతిగా ఉత్పత్తి అయ్యే జిడ్డును నియంత్రిస్తాయి,
మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. చర్మానికి సహజమైన కాంతిని పెంచుతాయి.
ఫేస్ మాస్క్ అంటే..
ఫేస్ మాస్క్‌లు సాధారణంగా మార్కెట్లో సులభంగా లభించే రెడీమేడ్ చర్మ సంరక్షణ ఉత్పత్తులు. నేటి కాలంలో ఇంట్లో కూడా ఫేస్ మాస్క్ లను తయారు చేసుకుని వాడుతున్నారు. వీటిలో అనేక రకాలు ఉన్నాయి. వాటిలో కొన్న..
షీట్ మాస్క్
క్లే మాస్క్
జెల్ మాస్క్
పీల్-ఆఫ్ మాస్క్
ఫేస్ మాస్క్‌లు చర్మానికి తేమను అందించి, తక్షణ మెరుపును ఇవ్వడానికి ఉపయోగపడతాయి.
ఫేస్ మాస్క్‌ల ప్రయోజనాలు..
చర్మానికి తక్షణమే తేమను అందించి ముఖ చర్మాన్ని తాజాగా ఉంచడంలో సహాయపడతాయి. నిస్తేజంగా ఉన్న చర్మాన్ని ప్రకాశవంతం చేస్తాయి. చర్మానికి విశ్రాంతినిస్తాయి. అప్పటికప్పుడు చర్మం రిలాక్స్ కావాలన్నా, వెంటనే చర్మానికి జీవం పోసినట్టు మెరుపు కావాలన్నా ఫేస్ మాస్క్ బాగా సహాయపడుతుంది.
ఏది మంచిది?
ఫేస్ మాస్క్ లేదా ఫేస్ ప్యాక్ లలో చర్మానికి ఏది మంచిది అనే విషయం చర్మ రకంపై ఆధారపడి ఉంటుంది. జిడ్డు చర్మం అయితే, ఫేస్ ప్యాక్ బాగా ప్రయోజనకరంగా ఉంటుంది. అదే చర్మం పొడిగా ఉంటే, ఫేస్ మాస్క్ బాగుంటుంది. కాంబినేషన్ స్కిన్ ఉన్నవారు రెండింటిని ఉపయోగించవచ్చు.
చర్మ సంరక్షణ నిపుణుల సలహా..
వారానికి ఒకసారి ఫేస్ ప్యాక్, అప్పుడప్పుడు ఫేస్ మాస్క్ వాడితే, చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుందని చర్మ సంరక్షణ నిపుణులు చెబుతున్నారు.
*రూపశ్రీ.
