Home » Ladies Special » చిత్రకళలలో అందెవేసిన చెయ్యి

 

చిత్రకళలలో అందెవేసిన చెయ్యి


అందమైన చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ,    అలవోకగా కుంచెను తిప్పగల నేర్పు...  చిన్నారులకి ఫేవరెట్ (ఇష్టమైన) ఆర్ట్ టీచర్ గా,  ఎన్నో కళలను అందంగా తీర్చి దిద్దగల సుధా స్రవంతి రస్తోగీతో కాసేపు...

ఇటీవల గోకులాష్టమి సంధర్భంగా జూబిలీహిల్స్ లోని "సప్తపర్ణి" లో ఫైన్ ఆర్ట్స్ పై వర్కషాప్ జరిగింది. గుడ్ సీడ్స్ వారు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో  పర్ఫెక్ట్ స్ట్రోక్ ఆర్ట్ అకాడమీ వారి ఆర్ట్  పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ లో వుంచటం తో పాటు ఆసక్తి గల వారికి పెయింటింగ్ క్లాసులు కూడా నిర్వహించారు. ఆ సందర్భంగా ఆర్టిస్ట్ మరియు ఆర్ట్ టీచర్ శ్రీమతి సుధా స్రవంతి రస్తోగీ తమ అకాడమీ గురించిన విశేషాలు వివరించారు.

2010లో ఏర్పాటు చేసిన పర్ఫెక్ట్ ఆర్ట్ స్రోక్ అకాడమీ లో ఇంతవరకూ చాలా మంది విద్యార్ధులు నేర్పుకున్నారు. ఇక్కడ నేర్చుకునే  అంశాల గురించి అడిగితే  "స్టూడెంట్ కి ఏ అంశంపై ఆసక్తి వుంట్ ఆ అంశం పై నేర్పిస్తాము.  ఇక్కడ దాదాపు 41 అంశాలలో శిక్షణ ఇస్తాము.  డ్రాయింగ్, స్కేచ్చింగ్, తంజావూర్   పెయింటింగ్, 3డి  మురల్  పెయింటింగ్ , అక్రిలిక్ పెయింటింగ్,  ఫాబ్రిక్ పెయింటింగ్, స్టైన్ వుడ్ పెయింటింగ్, వాటర్ కలర్ పెయింటింగ్. కేరళ పెయింటింగ్, గ్లాస్ పెయింటింగ్, తంజావూర్   పెయింటింగ్, సింగల్ స్ట్రోక్ పెయింటింగ్ ఇలా ఎన్నో రకాల పెయింటింగ్స్ వున్నాయి.  ఆసక్తి గల విద్యార్ధులకి  ఇక్కడ అన్ని నేర్పిస్తారు.  అంతే కాదు పాలిమర్  క్లే, టెర్రకోట జ్యువలేరి,  క్విల్లింగ్ , పంచ్ క్రాఫ్ట్, చాక్లెట్ తయారి, కాండిల్ తయారి,  వంటివి కూడా నేర్పిస్తాము.’’  అని అంటారు.


ఈ అకాడమీలో నేర్చుకోడానికి వయస్సు ఏమైనా వుందా అంటే... లేదు? ఇక్కడ చిన్నారులే కాదు రిటైర్ అయిన వాళ్ళు,  చిన్నప్పుడు తీర్చుకోలేని, నేర్చుకోలేని వాళ్ళు, ఇలా ఎవరికి ఆసక్తి వుంటే వారికి నేర్పిస్తాము.  ముఖ్యంగా ఆడవాళ్ళు తమ కిట్టీ పార్టీలలో  తంబోలా వంటి ఆటలు డబ్బుతో ఆడుతుంటారు. వాళ్ళు కూడా ఆ డబ్బుతో ఇలా ఆర్ట్ క్లాసెస్ వర్క్ షాపులు నిర్వహించమని అంటారు.  ఇలా వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా పాట్ పెయింటింగ్ వంటివి నేర్చుకుంటున్నారు...." అని అంటారు సుధ.

ప్రస్తుతం ఈ ఫైన్ ఆర్ట్ కి ఎలాంటి స్పందన వుందని అడిగితే.... "చాలా మంచి రెస్పాన్స్ వుంది.  తల్లిదండ్రులలో కూడా మార్పు వచ్చింది. తల్లిదండ్రులిరువురూ ఉద్యోగాలు... పిల్లలు ఎప్పుడూ చదువులే! ఈ పోటీ ప్రపంచంలో నిలబడటానికి విద్యార్ధులకీ కొంత రిలాక్స్ కావాలి... శని ఆదివారాలు, సమ్మర్ లోను మేము నిర్వహంచే వర్క్ షాపులకి పేరెంట్స్  తమ పిల్లలని పంపిస్తున్నారు.... అత్యత్సాహంతో పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు.  ఎక్కడైనా ఎగ్జిబిషన్ లు జరిగితే తాము వేసిన పెయింటింగ్స్ కూడా ప్రదర్శిస్తుంటారు... అది వారికి ఎంతో మానసిక ఉత్సాహాన్నిస్తుంది.... మా వద్దకు వచ్చే స్టూడెంట్స్ ని చూస్తే చదువులే కాదు ఇతర అంశాల్లోనూ ఆసక్తి వుందని తెలుస్తుంది. నా అభిప్రాయం ప్రకారం తల్లితండ్రులు తమ పిల్లలకి ఎందులో ఆసక్తి వుందో గమనించి ఆ విషయాల్లో నేర్పిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అది ఫైన్ ఆర్ట్సే కాదు... డాన్స్, సంగీతం, ఆటలు, క్రియేటివిటీ అంశాలు ఇలా ఏవైనా కావచ్చు’’ అని అంటారు సుధా రస్తోగి.

భారతీయ సంస్కృతికి అద్దం పట్టే ఈ చిత్రకళకి మెరుగులు దిద్దుతూ ఎన్నో ఆసక్తికరంగా విద్యార్ధులకి నేర్పిస్తూ ముందుకి వెడుతున్న ఈ పరెఫెక్ట్ ఆర్ట్స్ భవిష్యత్తు ఉజ్వలంగా వుంటుంది... వీరు చేసిన ఆర్ట్ లు ఎందరో కళాభిమానుల ఇళ్ళలో అలరిస్తున్నాయి. విదేశాలనుంచి కూడా  ఆర్డర్స్ వస్తుంటాయి.

ఆనిమేషన్ లో డిగ్రీ పొందిన పవన్ రస్తోగి, సుధా రస్తోగి దంపతులిరువురు ఈ అకాడమిని విజయవంతంగా నడిపిస్తున్నారు. వీరు నేర్పించే  పెయింటింగ్స్ లో కాఫీ పొడితో చేసే పెయింటింగ్స్ చాలా బాగున్నాయి.

మీరు నేర్పించే ఇన్ని అంశాలలో ఏ ఆర్ట్ట్ ఎక్కువగా ఆదరిస్తున్నారు అని అడిగితే.... "మేము నేర్పించే ప్రతి పెయింటింగ్ కోర్సు మాకెంతో ఇష్టం. అలాగే అన్నిటి మీదా అందరికీ ఆసక్తి వుంటుంది.   ప్రస్తుతం ఎక్కువగా 3డి సాస్ పెసొ ఆర్ట్ ని ఎక్కువగా ఆదరిస్తున్నారని, అలాగే  ఆర్డర్లు కూడా వస్తుంటాయి.  యువతని ఎక్కువగా  అందంగా వుండే టెర్రకోట జ్యువెలరీ, పేపర్తో చేసే కీ చైన్స్ ఆకర్షి స్తున్నాయి"అని అంటారు సుధ. 


సుధా స్రవంతి రస్తోగీ ...

డిగ్రీ చదివి వీరు హార్డ్ ఆనిమేషన్ అకాడమీలో 2డి. ట్రెడిషనల్ ఆనిమేషన్ లో డిప్లోమా చేశారు.

సుధా స్రవంతి అభినందన  పంచరత్న అవార్డు, వాసవి ఆర్ట్ ధియేటరర్స్ వారిఆల్ రౌండర్ అవార్డు, కామ్లిన్ వారి స్టేట్ అవార్డుని అందుకున్నారు.... ఈ అకాడమీ వద్దకు వచ్చే వారిలో ప్రముఖ సినీ, రాజకీయ నాయకుల పిల్లలు, మనుమలు మనుమరాళ్ళు వస్తుంటారు. వారిలో ప్రస్తుతం మహేష్ బాబు కూతురు, తాళ్ళపాక అన్నమయ్యగారి (7వ తరం) మనవరాలు, సీతారామశాస్త్రిగారి మనవరాలు, మాజీ మంత్రి  సబితారెడ్డిగారి మనవరాలు, మాజీ మంత్రివర్యులు జానారెడ్డి గారి మనుమలు మనుమరాళ్ళు వున్నారు.

వీరి శ్రీవారు పవన్ రస్తోగీ కూడా  ఫైన్ ఆర్ట్స్ లో, ఆనిమేషన్ లో కూడా డిప్లోమా చేశారు. వీరు ఇరువురు 2010లో పర్ఫెక్ట్ స్ట్లోక్ ఆర్ట్ అకాడమీని స్థాపించారు. దీని ద్వారా ఎంతో మందిని ఆర్టిస్ట్ లుగా తీర్చిదిద్దుతున్నారు.... వీరి అమ్మాయి, అబ్బాయి కూడా ఈ కళపై ఆసక్తి  చూపిస్తూ ఎన్నో పెయింటింగ్స్ వేస్తున్నారు.

చిన్నారుల మదిలో చెలరేగే ఆలోచనలు, అభిరుచులు తెలుసుకొని వారికి అనుగుణంగా తీర్చిదిద్దితే వారి భవిష్యత్త్ నందనవానమే.....  పిల్లలే కాదు పెద్దలు కుడా తమ మానసిక వికాసానికి దారులు వెతుకుతున్నారు. ఎవరైనా  ఫైన్ ఆర్ట్స్   నేర్చుకోవాలంటే పర్ ఫెక్ట్ స్ట్రోక్ ఆర్ట్ అకాడమీలో చేరచ్చు.



.......Maninath Kopalle


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.