Home » Health Science » రక్తం తక్కువ ఉన్నప్పుడు ఏం తినాలి...
రక్తం తక్కువ ఉన్నప్పుడు ఏం తినాలి..

ప్రతి జీవికి రక్తం ప్రదానమైనది. ఆహారం ద్వారా లభించే శక్తి రక్తం ద్వారానే శరీర అవయవాలకు చేరుతుంది. ఆక్సిజన్ సరఫరాకు రక్తమే ప్రధానం, శరీర అవయవాలు సమర్థవంతంగా పనిచేయాలన్నా, గుండె పనితీరు బాగుండాలన్నా, ముఖ్యంగా మహిళలకు నెలసరి సమస్యలు లేకుండా ఆరోగ్యం బాగుండాలన్నా, కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలన్నా, సుఖ ప్రసవం జరగాలన్నా ప్రధానమైనది రక్తమే. రక్తంలో రెండు ముఖ్యమైన భాగాలు ఉంటాయి. ఒకటి ఎర్ర రక్త కణాలు, రెండవది హిమోగ్లోబిన్. ఇవి రక్త స్థాయిలను నిర్ణయిస్తాయి. రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య సాధారణం కంటే తక్కువగా ఉన్నప్పుడు లేదా హిమోగ్లోబిన్ స్థాయి తగ్గినప్పుడు రక్తహీనత అనే సమస్య వస్తుంది.
రక్తహీనత మొత్తం శరీర పనితీరును దెబ్బతీస్తుంది. ఇది అలసట, బలహీనత, చర్మం పాలిపోవడం, శ్వాస ఆడకపోవడం, హృదయ స్పందనలు వేగంగా ఉండటం,కాళ్లు, చేతులు చల్లగా ఉండటం, తలనొప్పి అధికంగా ఉండటం వంటి సమస్యలకు కారణమవుతుంది. ఇది మెదడు ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
ఐరన్ కు రక్తానికి మధ్య సంబంధం..
శరీరంలో రక్త స్థాయిలు ఆరోగ్యంగా ఉండటానికి ఐరన్ చాలా అవసరం. ఎందుకంటే ఇది హిమోగ్లోబిన్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఊపిరితిత్తుల నుండి శరీరంలోని మిగిలిన భాగాలకు ఆక్సిజన్‌ను తీసుకెళుతుందని.
రక్తహీనతకు యాపిల్ ..
రక్తహీనతకు యాపిల్ తినడం చాలా మంచి మార్గమని వైద్యులు చెబుతున్నారు. యాపిల్స్ లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజూ యాపిల్స్ తినడం వల్ల ఐరన్ తిరిగి లభిస్తుంది. రక్త స్థాయిలు మెరుగుపడతాయి.
యాపిల్స్ చాలా పోషకమైన పండు. కానీ రక్తాన్ని పెంచడానికి చాలామంది దానిమ్మపండ్లను సజెస్ట్ చేస్తుంటారు. కానీ యాపిల్స్ రక్తాన్ని పెంచడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది.
యాపిల్ లో ఐరన్ కంటెంట్..
1 కప్పు తొక్క తీసిన ఆపిల్ ముక్కలలో 0.8mg ఐరన్ ఉంటుంది. పురుషులకు రోజుకు 8mg ఐరన్ అవసరం, స్త్రీలకు ఇంకా ఎక్కువ అవసరమవుతుంది.
యాపిల్ తింటే కలిగే ఇతర బెనిఫిట్స్..
యాపిల్ పండు బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. యాపిల్స్ లో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ తో పాటు నీటి శాతం కూడా మెరుగ్గా ఉంటాయి. కాబట్టి రక్తహీనత ఉన్నవారు వీలైనంత వరకు యాపిల్స్ ను తింటూ ఉంటే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి.
*రూపశ్రీ.
