Home » Diet and Health » మహిళలు తమ ఆహారంలో ఈ పదార్థాలు అస్సలు మిస్ కాకూడదు!
మహిళలు తమ ఆహారంలో ఈ పదార్థాలు అస్సలు మిస్ కాకూడదు!

మగవారితో పోలిస్తే మహిళల శరీరం చాలా విభిన్నం, అలాగే ప్రత్యేకం. మహిళల శరీరం ప్రతి దశలో చాలా మార్పులకు లోనవుతుంది. ఈ కారణంగా ప్రతి దశలో వచ్చే మార్పులకు అనుగుణంగా శరీరానికి కావలసిన పోషకాలు కూడా మారుతూ ఉంటాయి. అందుకే మహిళలు ప్రతి వయస్సులోనూ తమ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సరైన పోషణ శక్తి స్థాయిలను కాపాడటమే కాకుండా, హార్మోన్ల సమతుల్యతను, ఎముకల బలాన్ని, చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ఈ కారణం వల్ల మహిళలు సరైన ఆహారాలను ఎంచుకోవడం మహిళల ఆరోగ్యానికి ఎంతో అవసరం. మహిళలు ఏ వయసులో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? అది వారికి చేసే మేలు ఏమిటి? పూర్తీగా తెలుసుకుంటే..
ప్రోటీన్..
శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం. ఇది మాంసం, పప్పుధాన్యాలు, గుడ్లు , చీజ్‌లో లభిస్తుంది. ప్రోటీన్ కండరాల నిర్మాణానికి సహాయపడి, శక్తిని అందిస్తుంది. మహిళలు తగినంత ప్రోటీన్ తీసుకోవడం వల్ల బలాన్ని కాపాడుకోవడంతో పాటు అలసట కూడా తగ్గుతుంది.
విటమిన్-డి..
ఎముకలకు , రోగనిరోధక వ్యవస్థకు విటమిన్ డి చాలా అవసరం. ఇది పాలు, జున్ను, పుట్టగొడుగులు వంటి ఆహారాలలో మాత్రమే కాకుండా.. నేరుగా ఉదయం ఎండలో కాసేపు గడవడం వల్ల కూడా లభిస్తుంది. తగినంత విటమిన్ డి తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా ఉండటానికి , శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది.
విటమిన్-సి..
విటమిన్ సి శరీర రోగనిరోధక శక్తిని పెంచి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది నారింజ, కివీ , స్ట్రాబెర్రీ వంటి నిమ్మ జాతి పండ్లలో లభిస్తుంది. విటమిన్ సి ని క్రమం తప్పకుండా తీసుకోవడం జలుబు , చర్మ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.
ఐరన్..
రక్తం ఏర్పడటానికి , శరీరంలో శక్తిని నిలుపుకోవడానికి ఐరన్ చాలా అవసరం. ఇది పాలకూర, చిక్కుడు కాయలు, బీన్స్ , రాగులు, మునగాకు వంటి వాటిలో లభిస్తుంది. ముఖ్యంగా మహిళలకు రక్తహీనత , అలసట వంటి సమస్యలను నివారించడానికి ఐరన్ అవసరం.
కాల్షియం..
ఎముకలు , దంతాలను బలంగా ఉంచడానికి కాల్షియం సహాయపడుతుంది. ఇది పాలు, పెరుగు, జున్ను , బాదంపప్పు వంటి వాటిలో లభిస్తుంది. తగినంత కాల్షియం తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి , వయసు పెరిగే కొద్దీ ఆస్టియోపొరోసిస్‌ను నివారించవచ్చు.
ఫైబర్..
ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థను నిర్వహించడానికి ఫైబర్ సహాయపడుతుంది. ఇది ఓట్స్, బ్రౌన్ రైస్, పండ్లు , కూరగాయలలో లభిస్తుంది. ఫైబర్ తీసుకోవడం వల్ల మలబద్ధకం , జీర్ణ సమస్యలు తగ్గుతాయి , ఎక్కువసేపు నిలిచే శక్తి లభిస్తుంది.
పైన పేర్కొన్న పదార్థాలను మహిళలు తమ ఆహారంలో ఉండేలా తప్పక చూసుకోవాలి.
*రూపశ్రీ.
