Home » Diet and Health » గర్బధారణ సమయంలో కుంకుమ పువ్వు పాలు ఎందుకు తాగుతారు.!

గర్బధారణ సమయంలో కుంకుమ పువ్వు పాలు ఎందుకు తాగుతారు.!

గర్భధారణ సమయం అనేది ప్రతి మహిళ జీవితంలోనూ ఎంతో ప్రత్యేకమైన , సున్నితమైన దశ. ఈ సమయంలో కాబోయే తల్లులు తమ ఆరోగ్యం పట్ల, ఆహారపు అలవాట్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. తల్లి తీసుకునే ప్రతి ఆహారం నేరుగా గర్భంలోని బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. అందుకే ఏ ఆహారం తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు అనే దానిపై అనేక సందేహాలు వస్తుంటాయి.

ముఖ్యంగా గర్భధారణ సమయంలో  కుంకుమపువ్వు కలిపిన పాలు తాగడం  అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం, సరైన పద్ధతిలో , పరిమిత మోతాదులో కుంకుమపువ్వు పాలు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో.. ఆయుర్వేదం దీని గురించి ఏం చెబుతోందో వివరంగా తెలుసుకుంటే..

జీర్ణవ్యవస్థ..

గర్భధారణ సమయంలో కుంకుమపువ్వు పాలు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఈ సమయంలో చాలా మంది మహిళలు గ్యాస్, అజీర్తి, ఎసిడిటీ , మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. కుంకుమపువ్వు కలిపిన పాలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కడుపులో అసౌకర్యం తగ్గి జీర్ణక్రియ సజావుగా సాగడానికి సహాయపడుతుంది. అలాగే ఉదయం పూట వచ్చే వికారం లేదా వాంతుల సమస్యను నియంత్రించడంలో కూడా ఇది సహాయపడుతుంది.

మానసిక ఆరోగ్యం..

గర్భిణీ స్త్రీలలో హార్మోన్లలో వచ్చే మార్పుల కారణంగా మానసిక ఆందోళన , ఒత్తిడి పెరుగుతుంటాయి. కుంకుమపువ్వులో ఉండే సహజ గుణాలు మనసును ప్రశాంతంగా ఉంచడానికి , మూడ్ స్వింగ్స్ ను నియంత్రించడానికి సహాయపడతాయి. దీనివల్ల కాబోయే తల్లి మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతుంది.

 ఇది కూడా చదవండి      గర్బధారణ సమయంలో కుంకుమ పువ్వు పాలు ఎందుకు తాగుతారు.!

నిద్ర..

గర్బధారణ సమయంలో మంచి నిద్ర చాలా అవసరం. అనేక మంది గర్భిణీలకు రాత్రి సమయంలో సరిగ్గా నిద్ర పట్టదు. కుంకుమపువ్వు పాలు తాగడం వల్ల మెదడు రిలాక్స్ అయ్యి, గాఢమైన , ప్రశాంతమైన నిద్రపడుతుంది. ఇది శరీరానికి అవసరమైన శక్తిని అందించి అలసటను దూరం చేస్తుంది.

బీపీ..

కుంకుమపువ్వులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచడానికి ఎంతగానో సహాయపడతాయి. అయితే తక్కువ రక్తపోటు సమస్య ఉన్నవారు దీనిని డాక్టర్ల సలహా మేరకే తీసుకోవాలి. అంతేకాకుండా పాలు , కుంకుమపువ్వు కలయిక వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.

ఎముకలకు బలం..

పాలలో ఉండే కాల్షియం , ప్రొటీన్లు గర్భిణీ స్త్రీల ఎముకలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

ఇమ్యూనిటీ..

శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా ఇది చక్కగా పనిచేస్తుంది. కుంకుమపువ్వు పాలు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి బలపడి, సాధారణ అనారోగ్య సమస్యల నుండి శరీరం రక్షణ పొందుతుంది.

జాగ్రత్త..

అయితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం.
కుంకుమపువ్వును గర్భధారణ తొలి ఐదు నెలల్లో డాక్టర్ల సలహా మేరకు మాత్రమే పరిమిత మోతాదులో తీసుకోవాలి. సాధారణంగా పాలు లేదా పాయసంలో కేవలం రెండు నుండి మూడు కుంకుమపువ్వు రేకలను మాత్రమే కలపాలి. అతిగా తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉంది.

ముఖ్యంగా హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్నవారు, అలర్జీ సమస్యలు ఉన్నవారు, లేదా వాంతులు, విరేచనాలు వంటి ఇబ్బందులు ఉన్నవారు వైద్యుల సూచన లేకుండా దీనిని తీసుకోకూడదు. కాబట్టి గర్భధారణ సమయంలో ఏ కొత్త ఆహారాన్ని అలవాటు చేసుకునే ముందైనా  గైనకాలజిస్ట్ లేదా ఆయుర్వేద నిపుణుల సలహా తీసుకోవడం ఎప్పుడూ మంచిది.

                                                                                                                                           *రూపశ్రీ.

 

    

 


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.