Home » Beauty Care » వర్షాకాలంలో ముఖానికి ఏ క్రీమ్ ఉత్తమమైనదో తెలుసా!
వర్షాకాలంలో ముఖానికి ఏ క్రీమ్ ఉత్తమమైనదో తెలుసా!

వాతావరణం మారిన ప్రతిసారి శరీరంలో మొదటగా ఇబ్బంది పడేది చర్మమే. చర్మం ప్రత్యక్షంగా ప్రభావానికి లోనవుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల చర్మం జిగటగా మారడం మొదలవుతుంది. అందువల్ల సీజన్ కు తగ్గట్టుగా ఫేస్ క్రీమ్ ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. వర్షాకాలంలో చర్మానికి తగిన క్రీమ్ ను ఎలా ఎంచుకోవాలో.. ఏ క్రీమ్ బాగుంటుందో తెలుసుకుంటే..
ఇలాంటి వాడకండి..
ఫేస్ క్రీములు చాలా రకాలుగా ఉంటాయి. వాటి టెక్చర్ ను బట్టి ఏ చర్మానికి ఏది బాగుంటుందనే విషయం తెలుసుకోవచ్చు. వర్షాకాలంలో బరువుగా, జిడ్డుతో కూడుకున్న క్రీములను పూయడం వల్ల చర్మ సమస్యలు మరింత పెద్దవి అవుతాయి. అందుకే బరువుగా ఉన్న క్రీములు వాడకూడదు. దానికి బదులు తేలికపాటి క్రీమ్స్ వాడాలి.
జిడ్డు చర్మం వారు..
వర్షాకాలంలో జిడ్డు చర్మం ఉన్నవారు జెల్ ఆధారిత క్రీములను ఉపయోగించాలి.
పొడి చర్మం.
పొడి చర్మం ఉన్నవారికి వర్షాకాలంలో వాతావరణం కారణంగా చర్మం మరింత పొడిబారి చర్మం పగుళ్లు వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వారు మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాసుకోవాలి.
వర్షాకాలంలో ఇవే బెస్ట్..
వర్షాకాలంలో ముఖానికి తేలికైన జిడ్డులేని, వాటర్ బేస్డ్ క్రీములు ఉత్తమంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడతాయి. అయితే అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. వర్షాకాలంలో చర్మం కోసం ఏదైనా కొత్త క్రీమ్ కొనాలని అనుకుంటే ముందుగా చర్మం రకం తెలుసుకుని ఆ తర్వాత క్రీమ్ కొనుగోలు చేయడం, దాన్ని వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
*రూపశ్రీ.

