Home » Beauty Care » రోజూ ఈ 5 తింటే చాలు.. నెల రోజుల్లో ముఖం మెరిసిపోతుంది..!
రోజూ ఈ 5 తింటే చాలు.. నెల రోజుల్లో ముఖం మెరిసిపోతుంది..!

చాలామంది అమ్మాయిలు అందం కోసం బ్యూటీ పార్లర్ మీద ఆధారపడతారు. అయితే బ్యూటీ పార్లర్ ఇచ్చే అందం కేవలం పైపై మెరుగులు గానే ఉంటుంది. అది కేవలం కొన్ని గంటలు, లేదంటే ఒకటి రెండు రోజులలో తగ్గిపోతుంది. ఫేషియల్ చేయించుకోవడం, బ్యూటీ ట్రీట్మెంట్ వంటివి తాత్కాలిక అందాన్ని ఇస్తాయి. కానీ శాశ్వతమైన అందం లేదా ఎక్కువ కాలం అందంగా కనిపించాలంటే అది కేవలం ఆహారం వల్ల మాత్రమే సాధ్యమవుతుందని అంటున్నారు ఆహార నిపుణులు. 5 రకాల ఆహారాలు రోజూ తింటుంటే కేవలం ఒక నెల రోజుల్లోనే ముఖం మెరిసిపోతుందని అంటున్నారు. ఇంతకీ అందంగా మారడానికి రోజూ ఏం తినాలో తెలుసుకుంటే..
సహజంగా మెరిసే చర్మం కావాలంటే ఇవి తినాలి..
సహజంగా మెరిసే చర్మాన్ని పొందడానికి ప్రోటీన్ అధికంగా ఉండే సలాడ్ తినాలి. దీని కోసం దోసకాయ, టమోటా, క్యారెట్ లను చిక్పీస్, కాటేజ్ చీజ్ లేదా మొలకలతో కలిపి తినవచ్చు. ఈ సలాడ్ చర్మాన్ని లోపలి నుండి పోషిస్తుంది. దీనిలోని ప్రోటీన్ చర్మ కణాలను రిపేర్ చేస్తుంది, ఫలితంగా ఆరోగ్యకరమైన చర్మం, చర్మానికి సహజంగానే మెరుపు వస్తుంది.
పెరుగు చర్మానికి చాలా ప్రయోజనాలు చేకూరుస్తుంది. పెరుగులోని ప్రోబయోటిక్స్ గట్ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది చర్మ ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. మొటిమలను తగ్గించడానికి, చర్మ ఆకృతిని మెరుగుపరచడానికి, ముఖానికి సహజమైన మెరుపును తీసుకురావడానికి సహాయపడుతుంది .
గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. ప్రతిరోజూ గ్రీన్ టీ తాగడం వల్ల వృద్ధాప్య సంకేతాలను తగ్గించి, చర్మాన్ని మెరుగ్గా ఉంచుతుంది.
సహజమైన మెరుపు కోసం స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్బెర్రీస్ వంటి పండ్లను తినవచ్చు. వాటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. దీనివల్ల దృఢమైన, ప్రకాశవంతమైన, మచ్చలు లేని చర్మం లభిస్తుంది.
బాదం, వాల్‌నట్స్, చియా, అవిసె గింజలను తినవచ్చు. వీటిలో చర్మాన్ని లోపలి నుండి తేమగా ఉంచే ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటిని రోజూ తినడం వల్ల పొడి చర్మం నుండి ఉపశమనం లభిస్తుంది . ఇది ముఖానికి పార్లర్ లాంటి మెరుపును ఇస్తుంది.
*రూపశ్రీ.
