Home » Beauty Care » పటిక ఇలా వాడితే.. ముఖం మీద మచ్చలు మాయం!
పటిక ఇలా వాడితే.. ముఖం మీద మచ్చలు మాయం!

మచ్చలు చాలామంది ముఖాన్ని డామినేషన్ చేస్తాయి. ఎంత అందంగా ఉన్న వారికైనా సరే.. ముఖం మీద మచ్చలు ఉంటే ముఖం ఏదో లోపం ఉన్నట్టు కనిపిస్తుంది. చర్మం మీద మచ్చలు తొలగించుకోవడానికి చాలా మంది మార్కెట్లో లభ్యమయ్యే చాలా రకాల క్రీములు వాడుతుంటారు. ఇంకా చాలా రకాల టిప్స్ కూడా ట్రై చేస్తుంటారు. ఎండల కారణంగా ముఖ చర్మం రంగు మారడం, హార్మోన్ల మార్పులు, చిన్న వయసులోనే ముసలివాళ్లలా చర్మం మారడం మెలనిన్ ఏర్పడటం వంటివి జరుగుతుంటాయి. అయితే వీటిని వదిలించుకోవడానికి పటికను ఉపయోగించవచ్చు. ముఖం చర్మం మీద మచ్చలు తొలగించుకోవాడినికి పటికను ఎలా వాడాలి? పటిక లక్షణాలు ఏమిటి? తెలుసుకుంటే..
పటిక లక్షణాలు..
పటికలో చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. పటికను ఉపయోగించడం వల్ల ముఖ ముడతలతో పాటు మచ్చలు, మొటిమలను కూడా తగ్గించవచ్చు. పటికను ఉపయోగించడం వల్ల చర్మం బిగుతుగా మారి, కొత్త కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
ఎలా ఉపయోగించాలి?
ముఖంపై పటిక, రోజ్ వాటర్ కాంబినేషన్ ఉపయోగించవచ్చు. పటిక పొడిని రోజ్ వాటర్‌తో కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి.. ఆ తర్వాత ముఖాన్ని మసాజ్ చేసుకోవాలి. దీన్ని 10 నుండి 15 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలు ఉన్న ప్రదేశాలలో అప్లై చేయాలి. ఇది చర్మపు రంగును సమంగా చేస్తుంది.
పటిక, ముల్తాని మట్టి..
పటిక పొడి, ముల్తానీ మట్టి , నీటిని కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించాలి. 15 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. మచ్చలను తేలికపరచడానికి ఈ పేస్ట్‌ను వారానికి ఒకసారి వాడాలి.
పటిక, కొబ్బరినూనె..
పొడి చర్మం ఉన్నవారు నిద్రపోయే ముందు ముఖానికి పటిక , కొబ్బరి నూనెను రాసుకోవచ్చు. పటిక పొడిని కొబ్బరి నూనెతో కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత, ఈ పేస్ట్‌ను ప్రభావిత ప్రాంతంలో రాయాలి. 10 నుండి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత, ముఖం కడుక్కోవాలి.
*రూపశ్రీ.
