Home » Fashion » సమ్మర్‌లోనూ ఫ్రెష్ లుక్‌తో కనిపించాలంటే.. ఈ డ్రెస్సింగ్ టిప్స్ ఫాలో అవ్వండి..!
సమ్మర్‌లోనూ ఫ్రెష్ లుక్‌తో కనిపించాలంటే.. ఈ డ్రెస్సింగ్ టిప్స్ ఫాలో అవ్వండి..!

వేసవి వచ్చేసింది, ఉష్ణోగ్రతలు రోజురోజుకూ క్రమంగా పెరుగుతున్నాయి. మండుతున్న ఎండ, చెమట మధ్య కూల్ గా ప్రొఫెషనల్‌గా ఎలా ఉండాలనేది వర్క్ చేసే వారికి అతి పెద్ద ఛాలెంజ్. తరచుగా హెవీ ఫార్మల్స్, ముదురు రంగులు వేసవిలో వేడిని పీల్చుకోవడమే కాకుండా, రోజంతా అసౌకర్యాన్ని, బద్ధకాన్ని కలిగిస్తాయి. నేటి కొత్త ఫ్యాషన్ ట్రెండ్‌ల ప్రకారం, ఆఫీస్ దుస్తులలో ఇప్పుడు సౌకర్యానికి ప్రాధాన్యత ఇవ్వబడుతోంది. వేసవిలో సరైన దుస్తులను ఎంచుకోవడం ఆత్మవిశ్వాసాన్ని, సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
వేసవి దుస్తులు..
వేసవిలో కాటన్, లినెన్, ఖాదీ వంటి సహజ దుస్తులు ఉపయోగించడం ఉత్తమ ఎంపిక అని నిపుణులు అంటున్నారు, ఎందుకంటే అవి చర్మాన్ని గాలి పీల్చుకోవడానికి, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇంకా, పాస్టెల్, లేత రంగులను ఎంచుకోవడం కళ్ళకు ఉపశమనం కలిగించడమే కాకుండా సూర్య కిరణాలను ప్రతిబింబించడం ద్వారా శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది.
రంగుల ఎంపికలు..
వేసవిలో ఆఫీసు దుస్తులకు లినెన్, కాటన్ బట్టలు ఉత్తమం. ఎందుకంటే అవి చెమటను త్వరగా గ్రహిస్తాయి.
ముదురు నలుపు లేదా నేవీ బ్లూకు బదులుగా, స్కై బ్లూ, లైట్ పింక్, పుదీనా ఆకుపచ్చ, ఆఫ్-వైట్ వంటి రంగులను ఆఫీసుకు ధరించవచ్చు.
లేత రంగులు మీకు తక్కువ వేడిని కలిగించడమే కాకుండా, ప్రొఫెషనల్ వాతావరణంలో ఇమేజ్‌ను డీసెంట్‌గా కనిపించేలా చేస్తాయి.
స్టైలిష్ ఎంపికలు..
కాటన్ కుర్తీలు, లినెన్ ప్యాంటు, ఫ్లేర్డ్ స్కర్టులు ఉద్యోగస్తులకు గొప్ప ఎంపికలు.
ఈ సీజన్‌లో టైట్ జీన్స్‌కు బదులుగా, పలాజోలు లేదా స్ట్రెయిట్-కట్ ప్యాంటు ధరించడం బాగుంటుంది, ఇవి స్టైలిష్‌గా, సౌకర్యంగా ఉంటాయి.
దుపట్టా లేదా స్కార్ఫ్ కోసం, షిఫాన్ లేదా మస్లిన్ ఫాబ్రిక్ ఉపయోగించాలి. ఇది బరువు తక్కువగా, సౌకర్యవంతంగా ఉంటుంది.
కాంబినేషన్స్..
లుక్ ని కంప్లీట్ గా పిక్స్ చేయడానికి పాదాలకు లోఫర్లు లేదా బాలేరినాస్ వంటి తేలికపాటి పాదరక్షలను ఎంచుకోవాలి. అయితే ఎక్కువ సేపు వీటిని ఇలాగే ధరించే పరిస్థితి ఉంటే వీటిని ఈ వేసవిలో పాదాలకు గాలి తగలక లోపల ఫంగస్, బ్యాక్టీరియా పెరిగి కాళ్ళ చర్మం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి పాదాలకు గాలి తగిలేలా ఉండే పుట్ వేర్ ఎంచుకోవాలి.
బరువైన ఆభరణాలు లెదర్ బెల్టులకు బదులుగా, చెమట కారణంగా చర్మాన్ని చికాకు పెట్టని వాటిని ఉపయోగించాలి.
ఎల్లప్పుడూ సన్ గ్లాసెస్, వాటర్ బాటిల్ వెంట తీసుకెళ్లాలి.
*రూపశ్రీ.
