Home » Beauty Care » నల్పమరాది తైలం.. రోజు నాలుగు చుక్కలు ఈ తైలాన్ని ముఖానికి రాస్తే.. జరిగే అద్భుతం ఇదే.. !

నల్పమరాది తైలం.. రోజు నాలుగు చుక్కలు ఈ తైలాన్ని ముఖానికి రాస్తే.. జరిగే అద్భుతం ఇదే.. !

నల్పమరాది తైలం చర్మ సంరక్షణలో అనాదిగా ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నది. ఆయుర్వేదంలో దీనిని చర్మానికి సంబంధించిన అనేక సమస్యలను నివారించడానికి గొప్ప ఔషధంగా పేర్కొన్నారు. ఈ నూనెను ముఖానికి క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు , దీని విశిష్టత గురించి వివరంగా తెలుసుకుంటే..

చర్మానికి సంబంధించిన సమస్యలు చాలా మందిని వేధిస్తుంటాయి. మచ్చలు, మొటిమలు, రంగు తక్కువగా ఉండటం, వయసు పెరిగే కొద్దీ వచ్చే ముడతలు వంటి అనేక ఇబ్బందులను ఎదుర్కొనేందుకు రకరకాల రసాయన క్రీమ్‌లు వాడుతుంటారు. అయితే ఇవి తాత్కాలిక ఫలితాలను మాత్రమే ఇస్తాయి. దీనికి భిన్నంగా ఆయుర్వేద సిద్ధాంతాల ఆధారంగా తయారైన నల్పమరాది తైలం చర్మానికి ఎటువంటి దుष्ప్రభావాలు లేకుండా సహజసిద్ధమైన మెరుపును అందిస్తుంది.

నల్పమరాది తైలం తయారీలో   అద్భుతమైన వృక్ష మూలికలు ఉపయోగిస్తారు. రావి, మేడి, జువ్వి, మర్రి వంటి నాల్గు రకాల  వృక్షాల బెరుడుతో పాటు పసుపు, మంజిష్ట, చందనం వంటి  ఆయుర్వేద ద్రవ్యాలను శుద్ధమైన నువ్వుల నూనెలో  కలిపి దీనిని తయారు చేస్తారు. ఈ మూలికలన్నీ కలిసి చర్మాన్ని లోపలి నుంచి శుభ్రపరిచే గుణాన్ని కలిగి ఉంటాయి.

ఈ తైలాన్ని ప్రతిరోజూ ముఖానికి రాసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా రోజుకు కేవలం నాలుగు చుక్కల నూనెను ముఖానికి పట్టించి సున్నితంగా మర్దన చేయడం ద్వారా చర్మ కణాలకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన పోషణ లభిస్తుంది.

ఇది కూడా చదవండి డీ-టాన్ లేదా బ్లీచ్.. చర్మానికి ఏది మంచిది.!

ముఖంపై ఎండ వల్ల వచ్చే ట్యాన్, మచ్చలు , నల్లటి వలయాలు క్రమంగా తగ్గిపోతాయి. చర్మం నిస్తేజంగా మారినప్పుడు ఈ నూనెను రాస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది. చర్మానికి సహజమైన రంగును , నిగారింపును తీసుకురావడంలో ఇది ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది.

మొటిమలు , వాటి వల్ల ముఖంపై మిగిలిపోయే మచ్చలను తొలగించడంలో నల్పమరాది తైలం చాలా బాగా సహాయపడుతుంది. ఇందులో ఉండే పసుపు , ఇతర యాంటీ బాక్టీరియల్ పదార్థాలు చర్మంపై ఉండే బాక్టీరియాను అరికట్టి మొటిమలు తిరిగి రాకుండా నిరోధిస్తాయి. అలాగే చర్మంలోని మృతకణాలను తొలగించి  కాంతివంతమైన చర్మం తిరిగి రావడానికి దోహదపడతాయి.

వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా చూడటంలో కూడా ఈ తైలం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ముఖంపై వచ్చే ముడతలు, గీతలు తగ్గుముఖం పడతాయి. చర్మం యవ్వనంగా, మృదువుగా ఉండేందుకు ఇది సహకరిస్తుంది.

అయితే ఈ తైలాన్ని ఉపయోగించేటప్పుడు కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం..

ఆయుర్వేద తైలాలు సాధారణంగా జిడ్డుగా ఉంటాయి కాబట్టి, రాత్రి సమయంలో దీనిని రాసుకోవడం మంచిది. కొద్ది చుక్కలను మాత్రమే చేతి వేళ్ళతో ముఖానికి రాసుకొని సున్నితంగా వృత్తాకారంలో మర్దన చేయాలి.  రాత్రంతా ఉంచుకుని ఉదయం గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

కొందరి చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి దీనిని ఉపయోగించే ముందు చేతిపై చిన్న పరీక్ష చేసి, ఎలాంటి అలర్జీ లేదని నిర్ధారించుకోవడం మంచిది.  

ఈ నూనెను ముఖానికి రాసుకున్న తర్వాత వెంటనే ఎండలోకి వెళ్లకుండా ఉండటం మంచిది.

సహజసిద్ధమైన ఆయుర్వేద మార్గాల ద్వారా చర్మాన్ని సంరక్షించుకోవాలనుకునే వారికి నల్పమరాది తైలం ఒక చక్కని ఎంపిక. రసాయనాలతో కూడిన ఉత్పత్తులకు దూరంగా ఉంటూ, ప్రకృతి సిద్ధమైన ఈ తైలాన్ని క్రమం తప్పకుండా వాడితే  ముఖం అందంగా, ఆరోగ్యంగా , కాంతివంతంగా మారుతుంది. ఈ తైలాన్ని రోజువారి స్కిన్ కేర్ లో భాగం చేసుకుంటే చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.


                                                                                                                                              *రూపశ్రీ.


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.