Home » Beauty Care » జుట్టు పెరుగుదల తగ్గిపోయిందా.. పెరుగుతో ఇలా ట్రై చేయండి!
జుట్టు పెరుగుదల తగ్గిపోయిందా? పెరుగుతో ఇలా ట్రై చేయండి..!

జుట్టు మనిషి అందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. అయితే జుట్టు అందంగా, బలంగా ఉంటే జుట్టు చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. నేటి కాలంలో జుట్టు ఆరోగ్యం కోసం అమ్మాయిలు వేలాది రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడటం లేదు. కానీ ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అవంతా కేవలం తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తాయి. కొందరిలో ఎన్నాళ్లు గడిచినా జుట్టు పెరుగుదలలో పెద్దగా మార్పు ఉండదు. జుట్టు పెరుగుదల మందగించినది అని చెప్పడానికి ఇది నిదర్శనం. అయితే జుట్టు తగ్గిపోయిన జుట్టు పెరుగుదలను తిరిగి వేగంగా మార్చగల చిట్కాలు ఉన్నాయి. ఇందుకోసం పెరుగు బాగా సహాయపడుతుంది.
పెరుగులోని లాక్టిక్ ఆమ్లం, ప్రోటీన్లు, విటమిన్లు జుట్టు మూలాలను పోషిస్తాయి. ఇది నెత్తిమీద చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. చనిపోయిన చర్మ కణాలు, మలినాలను తొలగిస్తుంది. కాబట్టి జుట్టు రాలడం లేదా జుట్టు పెరుగుదల మందగించడంతో ఇబ్బంది పడేవారు పెరుగుతో ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోగల హెయిర్ మాస్క్ లను ప్రయత్నించవచ్చు. ఆ హెయిర్ మాస్క్ లు ఏంటో, అవి ఎలా తయారు చేసుకుని వాడాలో.. తెలుసుకుంటే..
పెరుగు, కరివేపాకు మాస్క్..
కరివేపాకులో బీటా-కెరోటిన్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని నివారిస్తాయి . ఈ హెయిర్ మాస్క్ తయారు చేసుకోవడానికి అర కప్పు పెరుగులో కరివేపాకు పొడి లేదా కరివేపాకు పేస్ట్ ను కలిపి తలకు అప్లై చేయాలి. 30 నిమిషాలు అలాగే ఉంచి, తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోవాలి.
పెరుగు, తేనె, నిమ్మకాయ..
చుండ్రు ఉంటే అది జుట్టు పెరుగుదలను నియంత్రిస్తుంది. జుట్టు పెరగకుండా చేస్తుంది. అలాంటి వారికి పెరుగు, తేనె, నిమ్మకాయ మాస్క్ బాగా సహాయపడుతుంది. నిమ్మకాయలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు, తేనెలోని తేమ జుట్టును సిల్కీగా ఉంచుతాయి. ఒక టీస్పూన్ తేనె, సగం నిమ్మకాయ రసాన్ని ఒక గిన్నె పెరుగులో కలపాలి. దీన్ని జుట్టు మూలాలకు అప్లై చేసిస కనీసం 20 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది నెత్తి యొక్క pH స్థాయిని సమతుల్యం చేస్తుంది.
పెరుగు, గుడ్డు మాస్క్..
జుట్టు ప్రధానంగా కెరాటిన్తో తయారవుతుంది. గుడ్డు, పెరుగు కలిపితే జుట్టుకు శక్తివంతమైన ప్రోటీన్ బూస్ట్ లభిస్తుంది. ఈ మాస్క్ సిద్ధం చేయడానికి, ఒక గుడ్డును కొట్టి 2-3 టేబుల్ స్పూన్ల పెరుగు జోడించాలి. దీన్ని మొత్తం జుట్టుకు అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. వేడి నీటిని వాడటం మానుకోవాలి. ఎందుకంటే వేడి నీరు తగిలితే గుడ్డు గట్టిపడి జుట్టుకు అతుక్కుపోయే అవకాశం ఉంటుంది. ఈ మాస్క్ జుట్టును మందంగా చేస్తుంది.
పెరుగు, మెంతి గింజలు..
మెంతుల్లో నికోటినిక్ ఆమ్లం ఉంటుంది. ఇది జుట్టు తిరిగి పెరగడానికి సహాయపడుతుంది. ఈ పేస్ట్ తయారు చేయడానికి, రాత్రిపూట నానబెట్టిన మెంతి గింజలను మెత్తగా పేస్ట్ చేసి పెరుగుతో కలపాలి. దీన్ని తలకు అప్లై చేసి, సున్నితంగా మసాజ్ చేసి, 45 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది జుట్టును కుదుళ్ల నుండి బలపరుస్తుంది.
పెరుగు, కలబంద..
పొడిబారిన, నిర్జీవమైన జుట్టు ఉంటే జుట్టు పెరుగుదలకు ఇబ్బంది ఏర్పడుతుంది. . కలబందను పెరుగుతో కలిపి, తలకు అప్లై చేస్తే అది తలకు తేమను అందిస్తుంది . దీన్ని తయారు చేయడానికి తాజా కలబంద జెల్‌ను పెరుగుతో సమాన మొత్తంలో కలపాలి. జుట్టు పొడవు, మూలాలకు అప్లై చేయాలి.. గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది చిక్కులను తగ్గిస్తుంది, జుట్టు విరిగిపోకుండా చేస్తుంది.
ఇవి గుర్తుంచుకోండి..
తాజా పెరుగు..
ఎల్లప్పుడూ తాజా పెరుగును, అందులోనూ సాదా పెరుగును వాడాలి.
క్రమబద్దంగా..
ఉత్తమ ఫలితాల కోసం, ఈ మాస్క్‌లలో దేనినైనా కనీసం వారానికి ఒకసారి అప్లై చేయాలి.
ప్యాచ్ టెస్ట్
మీ చర్మం సున్నితంగా ఉంటే, ఉపయోగించే ముందు ఒక చిన్న ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది.
*రూపశ్రీ.

