Home » Baby Care » ఇంట్లో తయారు చేసిన బేబీ ఫుడ్ లేదా మార్కెట్‌లో లభించే బేబీ ఫుడ్.. పిల్లలకు ఏది మంచిదంటే!

ఇంట్లో తయారు చేసిన బేబీ ఫుడ్ లేదా మార్కెట్‌లో లభించే బేబీ ఫుడ్.. పిల్లలకు ఏది మంచిదంటే..!

పుట్టిన తర్వాత చిన్న పిల్లలకు తల్లిపాలే ఆహారం అవుతాయి. దాదాపు 6 నెలల వరకు పిల్లలకు తల్లిపాలే ఆహారంగా ఇస్తారు.  అయితే 6 నెలలు దాటిన తర్వాత పిల్లలు సాలిడ్ ఫుడ్ ఇవ్వడం మొదలుపెడతారు. పిల్లల మానసిక,  శారీరక ఎదుగుదలకు ఏ ఆహారాలు బాగుంటాయో అవి ఇవ్వాలని తల్లిదండ్రులు అనుకుంటారు.  30,40 దశాబ్దాల క్రితం చిన్న పిల్లలకు ఇచ్చే బేబీ ఫుడ్ మార్కెట్లో చాలా తక్కువగా లభించేవి. పిల్లలకు బేబీ ఫుడ్ ను పెద్దలు ఇంట్లోనే తయారు చేసేవారు. కానీ నేటి కాలంలో చిన్న పిల్లలకు బేబీ ఫుడ్ చాలా విరివిగా అందుబాటులో ఉంటున్నాయి. వీటిని కొనుగోలు చేసి వాడటం వల్ల తల్లులకు చాలా వరకు పని తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది.  పిల్లల ఆరోగ్యం కోసం ఇంట్లో తయారు చేసిన బేబీ ఫుడ్ మంచిదా?  మార్కెట్లో లభించే బేబీ ఫుడ్ మంచిదా?  తెలుసుకుంటే..

పిల్లలకు బేబీ ఫుడ్ ఎలా ఉపయోగపడుతుంది..

ఆరు నెలల తర్వాత, శిశువులకు శారీరక,  మానసిక అభివృద్ధి కోసం తల్లి పాలతో పాటు పోషకమైన ఆహారాన్ని అందించడం చాలా అవసరమని పిల్లల వైద్యులు చెబుతారు.  అందుకే పాలతో పాటు బేబీ ఫుడ్ కూడా ఇవ్వడం మొదలుపెడతారు.

ఇంట్లో తయారు చేసిన బేబీ ఫుడ్ ప్రయోజనాలు..

ఇంట్లో తయారుచేసిన బేబీ ఫుడ్ పౌడర్‌ను తాజా, సహజ పదార్థాలతో తయారు చేస్తారు. ఇందులో ప్రిజర్వేటివ్‌లు, అదనపు చక్కెర లేదా ఉప్పు ఉండవు. తల్లిదండ్రులకు పదార్థాలపై పూర్తి నియంత్రణ ఉంటుంది.  పరిశుభ్రతతో  బాగా వేయించడం లేదా ఉడికించడం,  గ్రైండ్ చేయడం వంటి పద్దతులలో తయారు చేస్తారు.   ప్రోటీన్, కాల్షియం మరియు ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు  బేబీ ఫుడ్ లో ఉన్నాయా లేదా అనేది గమనించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.


మార్కెట్లో లభించే బేబీ ఫుడ్ ప్రయోజనాలు..

వాణిజ్యపరంగా లభించే బేబీ ఫుడ్ పౌడర్లు సాధారణంగా ఫార్ములాతో రూపొందించబడతాయి,  బిడ్డకు అవసరమైన బలవర్థకమైన పోషకాలతో తయారు చేయబడాయి. వీటిని ఉపయోగించడం కూడా సులువే.. పైగా సేప్టీ టెస్ట్,  క్వాలిటీ టెస్ట్ కూడా చేయబడతాయి.  అయితే వాణిజ్యపరంగా లభించే కొన్ని ఉత్పత్తులలో అదనపు చక్కెరలు లేదా రుచులు ఉండవచ్చు.  కాబట్టి వాటిని కొనుగోలు చేసేముందు వాటి లేబుల్ గమనించడం చాలా ముఖ్యం.

ఏది మేలు?

ఆరు నెలల వయస్సు ఉన్న శిశువులకు తల్లిపాలు చాలా ముఖ్యమైనవని,  అవే  సరిపోతాయని పిల్లల వైద్యులు చెబుతున్నారు. ఆరు నెలల తర్వాత  ఘన పదార్థాలు ఇవ్వడం మొదలు పెట్టినప్పుడు ఆహారంలో , తాజా, సమతుల్యంగా ఉంటూ ఇంట్లో తయారు చేసిన ఆహారం సురక్షితమైనది. అయితే పిల్లలకు ఇచ్చే ఆహారంలో పోషకాల నుండి వాటిని తయారు చేయడం వరకు అన్నీ జాగ్రత్తలు తీసుకుని వాటిని సురక్షితంగా తయారు చేసి పిల్లలకు ఇవ్వగలిగితే అది చాలా మంచిది.  పిల్లలకు ఇచ్చే ఆహారం విషయంలో అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం.

తల్లిదండ్రులకు సమయం లేకపోవడం,  పిల్లలకు ఇచ్చే ఆహారం గురించి అవగాహన తక్కువ ఉండటం వంటి సమస్యలు ఉన్నప్పుడు మార్కెట్లో దొరికే బేబీ ఫుడ్ పౌడర్లు ఉపయోగించడం తప్పనిసరి అవుతుంది. అయితే మార్కెట్లో చాలా రకాల బేబీ ఫుడ్ లు అందుబాటులో ఉంటాయి కాబట్టి,  పిల్లలకు మంచి నాణ్యమైన బేబీ ఫుడ్ ఎంచుకోవాలి.

                                     *రూపశ్రీ.


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.